జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అత్యధిక త్రైమాసిక ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ వరుసగా ఆరో త్రైమాసికంలో నష్టాలను నమోదు చేసింది. అయితే నష్టాలు మాత్రం తగ్గాయి. ఎయిర్‌టెల్ ఏకీకృత ఆదాయం 22 శాతం పెరిగి రూ.25,785 కోట్లుగా ఉండగా, నికర నష్టం రూ.763 కోట్లుగా ఉంది. కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.23,045 కోట్లుగా ఉంది. ఏజీఆర్ బకాయిల కోసం రూ.28,450 కోట్లను కేటాయించడం వల్ల అప్పుడు భారీ నష్టాలు చూసింది.

ఆర్పు మూడేళ్ల గరిష్టం
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కావడంతో డేటా వినియోగం పుంజుకుంది. దీనికి తోడు టెలికం సేవల ఛార్జీల పెరుగుదల కలిసి వచ్చి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ ARPU మూడేళ్ల గరిష్ఠ స్థాయి రూ.162కు చేరుకుంది. ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఇది రూ.157గా ఉంది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో రూ.128గా నమోదయింది. ఆదాయం, ARPU పుంజుకున్నప్పటికీ రూ.763 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది నష్టంతో(రూ.23,045 కోట్లు) పోలిస్తే చాలా తక్కువ. లాభదాయకతను మెరుగుపరిచేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు.

డేటా ఉపయోగం 58% అప్
దేశంలో ఎయిర్‌టెల్ ఆదాయం 22 శాతం పెరిగి రూ.18,747 కోట్లుగా నమోదయింది. మొబైల్ ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదు చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 48.1 శాతం పెరిగి 15.27 కోట్లకు చేరుకుంది. నెలకు నెలకు ఒక వినియోగదారు సగటు డేటా వినియోగం 16 జీపీకాగా, వాయిస్ కాల్స్ వినియోగం నెలకు 1,005 నిమిషాలు.
ఘనా దేశ మార్కెట్లో నుండి వైదొలిగినట్లు ఎక్స్చేంజీలకు తెలిపింది. టెలికాం సేవలకు అంతగా డిమాండ్ ఉండని సీజన్ అయినప్పటికీ కంపెనీ మాత్రం 22 శాతం ఆదాయ వృద్ధితో పటిష్ఠమైన పనితీరును కనబర్చిందని ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ అన్నారు. తమ కస్టమర్ల డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 58 శాతం పెరిగిందన్నారు. మున్ముందు త్రైమాసికాల్లో లాభదాయకతను పెంచుకుంటామన్నారు.

ఎబిటా 32 శాతం అప్
2019 సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆదాయం రూ.21,131 కోట్లు కాగా, 22 శాతం పెరిగి రూ.25,785 కోట్లు నమోదయింది. ఎబిటా రూ.8,936 కోట్లు కాగా 32 శాతం పెరిగి రూ.11,848 కోట్లు నమోదయింది. ఎబిట్ రూ.1993 కోట్లుగా ఉండగా రూ.4,412 కోట్లకు పెరిగింది. ఇది 121.4 శాతం పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 191 శాతం పెరిగింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications