Airtel: దూసుకెళ్తున్న ఎయిర్‍టెల్.. నెలలో 1 మిలియన్ కస్టమర్లకు చేరిన 5జీ సేవలు..
5జీలో టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ దూసుకెళ్తోంది. ప్రారంభించిన 30 రోజుల్లోనే 1 మిలియన్ కస్టమర్లను అధిగమించినట్లు తెలిపింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలలో దశల వారీగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నెట్‌వర్క్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సెఖోన్ చెప్పారు.

యాపిల్ ఐఫోన్‌లు మినహా 5జీ
యాపిల్ ఐఫోన్‌లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు అన్నింటీకి ఈ నెల మధ్య నాటికి తమ 5జీ సేవలు అందిస్తామన్నారు. పలు నగరాల్లో సేవలు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇవి ప్రారంభ రోజులని, అయితే కస్టమర్ల నుంచి స్పందన బాగుందన్నారు. "అన్ని 5G పరికరాలు ఇప్పుడు ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌లో పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, మా నెట్‌వర్క్ ప్రతిరోజూ నిర్మిస్తున్నామన్నారు " అని సెఖోన్ చెప్పారు.

5G సేవలకు సపోర్ట్ చేస్తాయా
ఆపిల్, ఐఫోన్‌లు మినహా అన్ని 5G ఫోన్లకు ఎయిర్‌టెల్ సేవలకు సపోర్ట్ చేస్తాయని భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ తెలిపారు. నవంబర్ మొదటి వారంలో ఆపిల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని.. అన్ని పరికరాలు డిసెంబర్ మధ్య నాటికి కంపెనీ 5G సేవలకు సపోర్ట్ చేస్తాయన్నారు. ఎయిర్‌టెల్ 4G ధరలకు 5G సేవలను అందిస్తోంది. అయితే రాబోయే 6-9 నెలల్లో తదుపరి తరం సేవల ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

5.1 కోట్ల 5G స్మార్ట్‌ఫోన్లు
మార్కెట్ రీసెర్చ్ సంస్థ IDC ప్రకారం, 2020 నుంచి 2022 మధ్య నాటికి దేశంలో 5.1 కోట్ల 5G స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. అవి 2023 నాటికి 50 శాతం మార్కెట్ వాటాను దాటగలవని అంచనా. మార్చి 2024 నాటికి భారతదేశంలోని అన్ని పట్టణాలతో పాటు కీలకమైన గ్రామీణ ప్రాంతాలను కూడా 5జీ కవర్ చేయాలని కంపెనీ భావిస్తోందని విట్టల్ తెలిపారు. దీంతో గురువారం భారతి ఎయిర్ టెల్ స్టాక్ పెరిగింది.

Click it and Unblock the Notifications