భారతీ ఎయిర్‌టెల్ క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఎయిర్ ఐక్యూ అనే ఓమ్నీ కమ్యూనికేషన్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్స్‌లో ఇదో విప్లవాత్మక మార్పుగా ఎయిర్‌టెల్ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్ వ్యాల్యూ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రతి సంవత్సరం ఇరవై శాతం వృద్ధి సాధిస్తోంది.
ఈ రంగంలోకి అడుగు పెట్టిన మొదటి టెలికం ఆఫరేటర్ ఎయిర్‌టెల్. ఇప్పటికే ఎయిర్ ఐక్యూ సేవల కోసం స్విగ్గీ, జస్ట్ డయల్, అర్బన్ కంపెనీ, హావిల్స్, డాక్టర్ లాల్‌పత్ ల్యాబ్స్, రాపిడో సంతకాలు చేశాయి. ఇవి ఎయిర్‌టెల్ ఐక్యూ బీటా వర్షన్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. సేవలు ఉపయోగించుకున్నంత వరకే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉంది.

ప్రస్తుత మోడల్స్‌తో పోలిస్తే ఈ ప్లాట్‌ఫాం కంపెనీలకు దాదాపు నలభై శాతం ఖర్చు తగ్గిస్తుందని ఎయిర్టెల్ బిజినెస్ డైరెక్టర్ అండ్ సీఈవో అజయ్ చిట్కార అన్నారు. తమ ఇన్‌సైడ్ ఇంజినీరింగ్ స్ట్రెంత్ ద్వారా ఎయిర్‌టెల్ ఐక్యూ వంటి ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తులు డెవలప్ చేస్తోంది. ఎయిర్‌టెల్ ఐక్యూ వంటి ఉత్పత్తుల కోసం తమ వద్ద 1500 మంది డిజిటల్ టాలెంట్ ఉందని ఎయిర్‌టెల్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ అన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications