ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కంపెనీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏకంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడి సతీమణిని తొలగించింది. ప్రస్తుతం భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్‌నీర్ గ్రోవర్ ఉన్నారు. ఆయన సతీమణి మాధురీ జైన్ గ్రోవర్. వ్యక్తిగత సౌందర్య చికిత్సలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలు, అమెరికా, దుబాయ్‌లకు కుటుంబ సభ్యులతో పర్యనటల కోసం, నకిలీ ఇన్వాయిస్‌లతో కంపెనీ నిధులను వెచ్చించినట్లుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మాధురి కంట్రోల్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను కంపెనీ నుండి తొలగించారు. అంతేకాదు, ఆమె పేరిట ఉన్న స్టాక్ ఆప్షన్స్‌ను రద్దు చేశారు. ఆమె తన వ్యక్తిగత సిబ్బందికి కంపెనీ ఖాతాల నుండి డబ్బులు చెల్లించిందని, ఆయా పార్టీల నుండి నకిలీ ఇన్వాయిస్‌లను తయారు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కొటక్ మహీంద్రా బ్యాంకు సిబ్బందిని దూషించారనే ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం అశ్‌నీర్ గ్రోవర్‌ను కంపెనీ బోర్డు మూడు నెలల సెలవులపై పంపించింది. ఆ తర్వాత మాధురి కూడా సెలవులపై వెళ్లారు.

కంపెనీకి సంబంధించి వివిధ కొనుగోళ్లు, ఖర్చులకు సృష్టించిన నకిలీ బిల్లులను కంపెనీ ఫైనాన్షియల్ ఇన్-ఛార్జీగా ఉన్న మాధురి ఆమోదించేవారని, ఆరోపణల నేపథ్యంలో ఎంప్లాయిమెంట్ అగ్రిమెంట్ ప్రకారం మాధురిని ఫిబ్రవరి 22వ తేదీ నుండి సర్వీసుల నుండి టెర్మినేట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భారత్‌పే ప్రమోటర్ల మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications