Airtel Shares: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్ల చూపు ఎన్నికలపై ఉంది. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత లాభాలను అందించగలిగిన కంపెనీల షేర్లను వెతికే పనిలో ఉన్నారు. దీంతో చాలా మంది కొన్ని షేర్లపై మాత్రం భారీ బెట్టింగ్ వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెలికాం రంగానికి చెందిన దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ గురించి. వాస్తవానికి కంపెనీ ఈవారం తన మార్చి త్రైమాసిక ఫలితాను ప్రకటించింది. కంపెనీ ఆరోగ్యకరమైన ఆదాయాలను ప్రకటించటంతో అందరినీ ఆకట్టుకుంది. ఆఫ్రికా వ్యాపారం నుంచి కరెన్సీ డిప్రీసియేషన్ వల్ల ఆదాయాలు తగ్గినట్లు వెల్లడించింది. నైజీరియా కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా ఎయిర్‌టెల్ రూ.2,544.4 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోయింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల కోలాహలంలో స్టాక్ పాల్గొంటోంది. ఎన్నికల తర్వాత పేలుడు ర్యాలీతో లాభాలను అందించేందుకు స్టాక్ సిద్ధంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాబోయే రోజుల్లో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల తర్వాత కంపెనీ షేర్లలో ర్యాలీ కారణంగా ఉన్నందున విశ్లేషకుడు టెలికాం స్టాక్‌పై తన టార్గెట్ ధరను పెంచారు. షేర్ల కొనుగోలుకు సిఫార్సు చేస్తున్నారు. ఈ వార్తలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఎయిర్‌టెల్ షేర్ ధర స్వల్ప లాభంతో రూ.1,345.80 రేటు వద్ద ఎన్ఎస్ఈలో ప్రయాణాన్ని ముగించింది. ఇంట్రాడేలో స్టాక్ ధర గరిష్ఠంగా రూ.1,360గా ఉంది.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత టారిఫ్ రేట్ల పెంపుపై పందాలు బలంగా మారాయని నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఎన్నికల తర్వాత అన్ని టెలికాం కంపెనీలు టారిఫ్‌లను పెంచొచ్చని ఇప్పటికే వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఎయిర్ టెల్ సైతం రేట్ల పెంపును ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీ ఆదాయాలు పెరగొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఎయిర్‌టెల్ షేర్లకు 'BUY' రేటింగ్ అందించింది. దీంతో టార్గెట్ ధరను ఒక్కో షేరుకు రూ.1,600గా నిర్ణయించింది. ఇదే క్రమంలో నోమురా సంస్థ షేర్లకు రూ.1,550 టార్గెట్ ధరగా ప్రకటించింది.
ఇదే క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఎయిర్ టెల్ షేర్లకు తమ టార్గెట్ ధరను రూ.1,640గా పేర్కొంది. ఇక ఎంకే గ్లోబల్ భారతీ ఎయిర్‌టెల్ టార్గెట్ ధరను షేరుకు రూ.1,325 నుంచి రూ.1,400కి పెంచింది. ప్రస్తుతం రేట్ల పెంపు ఊహాగానాలతో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ సేవలను రోలవుట్ చేసిన టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి గణనీయమైన సంఖ్యలో కస్టమర్లను పొందుతోంది. ఇప్పటికే కంపెనీ మార్కెట్లోకి ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే అత్యధికంగా సగటున ఒక్కో యూజర్ నుంచి సంపాదిస్తున్న రెవెన్యూ అత్యధికంగా రూ.209గా ఉండటం ఆరోగ్యకరమైన ఆదాయాలను అందించటానికి దోహదపడుతోంది. గత త్రైమాసికంలో కంపెనీ బీటెల్ టెలిటెక్‌లో 97.12 శాతం వాటాను రూ.658 కోట్లకు కొనుగోలు చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications