IPO News: దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా ఎయిర్ టెల్ ప్రస్తుతం కొనసాగుతోంది. జియోకు ఏమాత్రం తగ్గకుండా తన సేవలను అందిస్తూ పోటీలో నిలిచిన ఏకైక కంపెనీగా ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో చాలా కాలం తర్వాత కంపెనీ నుంచి ఒక ఐపీవో మార్కెట్లోకి రాబోతోందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కంపెనీ సబ్సిడరీ అయిన Bharti Hexacom ఐపీవోను తీసుకురావాలని ఎయిర్ టెల్ యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రకారం కంపెనీ దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఐపీవోను ఫ్లోచ్ చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, దీనికోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి భారతీ హెక్సాకామ్ సంస్థను ఏప్రిల్ 20, 1995న స్థాపించటం జరిగింది. ఇందులో ఎయిర్ టెల్ మెజారిటీ వాటాలను కలిగి ఉండగా.. దాదాపు 30 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కలిగి ఉంది. భారతి హెక్సాకామ్ రాజస్థాన్, నార్త్ ఈస్ట్ సర్కిల్‌లో టెలికమ్యూనికేషన్ వ్యాపారాన్ని కలిగి ఉంది. రాజస్థాన్, ఈశాన్య ప్రాంతాలలో అతిపెద్ద మొబైల్ టెలిఫోనీ సేవల ప్రొవైడర్‌గా, రాజస్థాన్‌లో ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందిస్తోంది.
భారతి హెక్సాకామ్ మార్చి 2024 నాటికి అన్ని పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలను 5G సేవలతో కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. Airtel 5G ప్లస్ 4G కంటే 30 రెట్లు వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందిస్తోందని కంపెనీ దాని వార్షిక నివేదికలో పేర్కొంది. 5G హ్యాండ్‌సెట్ పర్యావరణ వ్యవస్థ సరసమైన ధరల వద్ద వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లతో క్రమంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది.


Click it and Unblock the Notifications