మీరు సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఆఫీసుకో లేదా ఎయిర్‌పోర్టుకో వెళ్లాలని ఓలా, ఉబెర్ యాప్‌లు ఓపెన్ చేసినప్పుడు భారీగా ఛార్జీలు చూసి షాక్ అయ్యి ఉంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు, క్యాబ్ డ్రైవర్లకు ఒకేసారి భారీ ఊరటనిచ్చేలా భారత్ ట్యాక్సీ యాప్ (Bharat Taxi App) ను తీసుకువస్తోంది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు.. ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే ఒక బలమైన ప్రత్యామ్నాయం.

'భారత్ ట్యాక్సీ' ప్రత్యేకత ఏంటి?
కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో 'సహకార్ సే సమృద్ధి' మిషన్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ పర్యవేక్షణలో ఇది నడుస్తుంది. దీని వెనుక అమూల్, ఇఫ్కో, నాఫెడ్ వంటి దిగ్గజ సహకార సంస్థల అండ ఉంది.
- జీరో కమిషన్ మోడల్: ఓలా, ఉబెర్ వంటి కంపెనీలు డ్రైవర్ల ఆదాయంలో 20-30% కమిషన్ రూపంలో తీసుకుంటాయి. కానీ, Bharat Taxi App లో డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ ఉండదు. ప్రయాణికుడు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్ జేబుకే వెళ్తుంది.
- డ్రైవర్లే యజమానులు: ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యే ప్రతి డ్రైవర్ ఒక షేర్ హోల్డర్‌గా ఉంటారు. అంటే సంస్థ నిర్ణయాల్లో వారు కూడా భాగస్వాములే.
ప్రయాణికులకు కలిగే లాభాలేంటి?
- తక్కువ ఛార్జీలు: కమిషన్ లేకపోవడం వల్ల డ్రైవర్లు తక్కువ ఛార్జీలకే ప్రయాణికులను తీసుకెళ్లగలరు. ప్రైవేట్ యాప్‌ల కంటే 15-20% తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు.
- సర్జ్ ప్రైసింగ్ లేదు: డిమాండ్ ఎక్కువగా ఉందని ఛార్జీలు పెంచడం (Surge Pricing) ఇందులో ఉండదు. ఫిక్స్‌డ్ ఫేర్ మాత్రమే ఉంటుంది.
- క్యాన్సిలేషన్ కష్టాలు ఉండవు: డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిల్ చేయడానికి వీలు లేకుండా కఠిన నిబంధనలు ఉన్నాయి.
- సేఫ్టీ ఫీచర్లు: SOS బటన్, రియల్ టైమ్ ట్రాకింగ్, ట్రిప్ షేరింగ్ వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టెక్ సిటీ కాదు.. ట్యాంకర్ల సిటీ! బెంగళూరు నీటి కష్టాలు.. రేపు మన పరిస్థితి కూడా ఇంతేనా?
తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం ఢిల్లీలో 51 వేల మంది డ్రైవర్లతో పైలట్ రన్ జరుగుతోంది. జనవరి 1, 2026 నుంచి ఢిల్లీలో అధికారికంగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గుజరాత్ మీదుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెక్నాలజీ వినియోగంలో ముందుంటాయి కాబట్టి.. 2026 ప్రథమార్ధంలోనే మనకు భారత్ ట్యాక్సీ (Bharat Taxi App) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే ఉబర్, ఓలా వంటి సంస్థలకు నష్టం చేకూరే అవకాశం ఉంది.
ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఐఓఎస్ (iOS) వెర్షన్ కూడా త్వరలోనే రానుంది. ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, సామాన్య ప్రయాణికుడి జేబుకు చిల్లు పడదు. అటు డ్రైవర్లకు ఇటు ఇటు ప్రయాణీకులకు ఇద్దరికీ మేలు జరుగుతుంది. ముఖ్యంగా క్యాబ్ ల్లో తిరిగే వారికి ఈ యాప్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications