లిక్విఫైడ్ గ్యాస్(LPG) కొనుగోలుదారు భారత్ పెట్రోలియం(BPCL) మిడిల్ ఈస్ట్ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని మరోసారి తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు భారత్ పెట్రోలియం కార్ప్ అంతర్జాతీయంగా సరఫరాదారుల నుండి బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది. మిడిల్ ఈస్ట్ ఉత్పత్తిదారులకు బిడ్స్ తెరిచి ఉంది. ఇప్పటికే BPCL అవసరాలలో ఎక్కువ భాగాన్ని అందిస్తోంది. భారత రెండో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన బీపీసీఎల్ ఈ సంవత్సరం తన సరఫరా వనరులను విస్తృతం చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పుడు ఇది సఫలం కాలేదు. ఇప్పుడు మరోసారి బిడ్స్‌ను ఆహ్వానించింది.

భారత్‌కు ఇలా చిక్కులు
మిడిల్ ఈస్ట్ దేశాల ధరలతో పోలిస్తే మంచి ధరకు సరఫరా చేయడం, ఎల్పీజీ వనరులను వైవిధ్యపరచడం వంటి లక్ష్యాలతో బీపీసీఎల్ ఈ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఇండియా ఎల్పీజీని వంట ప్రధానంగా ఎల్పీజీ కోసం ఉపయోగిస్తారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్ దేశాల నుండి వచ్చే ఎల్పీజీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరాలో కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో సౌదీ అరేబియా ప్రాసెసింగ్ యూనిట్ల పైన డ్రోన్ దాడి జరిగింది. తర్వాత కరోనా వైరస్ వల్ల సరఫరాపై దెబ్బ పడింది. వాషింగ్టన్-బీజింగ్ మధ్య ట్రేడ్ వార్ కారణంగా పర్షియన్ గల్ఫ్ ఎల్పీజీ కోసం భారత్ మరింత పోటీని ఎదుర్కొంది.

ఇదో లాజికల్ అడుగు
ఇది(బీపీసీఎల్ బిడ్ నిర్ణయం) ఒక లాజికల్ అడుగు అని ఇండస్ట్రీ కన్సల్టెంట్ ఎఫ్‌జీఈ విశ్లేషకులు జెస్లీన్ చువా అన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో భారత ఎల్పీజీ దిగుమతులు దాదాపు మిడిల్ ఈస్ట్ నుండి ఉన్నాయి. అమెరికా, చైనా మధ్య మరోసారి ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉండే పరిస్థితుల్లో సరఫరాను వైవిధ్యపరచడం ప్రయోజనకరమన్నారు. అయితే మిడిల్ ఈస్ట్ ఇప్పటికీ భారత్ అత్యంత సన్నిహిత అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. బీపీసీఎల్ ఇప్పుడు యూరోప్, అమెరికాలను కూడా ఎంచుకోవచ్చు. అయితే లాంగర్ షిప్పింగ్ టైమ్స్ వల్ల అదనపు ఖర్చును ఎదుర్కొంటాయి.

పెరగనున్న ఇంధన దిగుమతులు
బీపీసీఎల్ 2021లో 8,00,000 టన్నుల ఎల్పీజీ కోసం బిడ్డింగ్స్‌ను ఆహ్వానిస్తోంది. సరుకు రవాణా ఖర్చులు తగ్గించడంతో పాటు అరబ్ గల్ఫ్ ప్రాంతం నుండి సరుకులను ఉచితంగా షిప్పింగ్ బాధ్యత తీసుకునే అంశాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తోంది. ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలో పెట్రోల్, డీజీల్ సేల్స్ తగ్గినప్పటికీ వంటగ్యాస్ డిమాండ్ మాత్రం భారీగా పెరిగింది. జెస్లీన్ చువా ప్రకారం ఇంధన దిగుమతులు 2020లో 16 మిలియన్ టన్నుల నుండి వచ్చే ఏడాదికి 1.6 మిలియన్ టన్నులకు పెరగవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications