తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎయిరోస్పేస్, పర్యాటకం, స్పోర్ట్స్, సినిమా పరిశ్రమ, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రత్యేక జోన్లు కేటాయించారు. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. వచ్చే పదేళ్లలో సుమారు 10 లక్షల మంది ఇక్కడ ఉద్యోగాలు పొందుతారని దీంతో హౌసింగ్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఫేజ్-1లో 14 వేల ఎకరాల భూమిని సమీకరించగా, మరో 30 వేల ఎకరాలను సమీకరించడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. రహదారుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. భవిష్యత్తులో Bharat Future City పనులు ప్రారంభమైన తర్వాత.. ఈ ప్రాంతాల్లోని భూమి విలువలు మూడు రెట్లు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముచ్చర్ల, గుమ్మడవల్లి, లేమూరు, యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమన్ గల్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరానికి రూ.3 కోట్లు ధర ఉంటే.. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటైతే అంటే రెండు సంవత్సరాల లోపల ఇది రూ.15 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన గ్రోత్ కారిడార్‌లు, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌లతో ఆరంభమవుతున్నాయి. ఈ మార్గాల్లో భూమి కొనుగోలు చేసిన వారు భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుతో లిమిటెడ్ అభివృద్ధి కేవలం హైదరాబాద్ పరిధికి మాత్రమే పరిమితం అయినా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇరువైపులా 5 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌లలో హైరైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడుతున్నాయి.
భారత్ ఫ్యూచర్ సిటీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు హైవే ద్వారా కనెక్టివిటీ, హైటెక్ కంపెనీల రాక, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిరోస్పేస్ పరిశ్రమల అభివృద్ధితో మహేశ్వరం, రావిర్యాల, ఆదిభట్ల ప్రాంతాల రూపురేఖలు కూడా పూర్తిగా మారాయి. ప్రాజెక్ట్‌ల వేగవంతమైన అభివృద్ధికి, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్ సంస్థలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు టైమ్‌లైన్ పెట్టి అనుమతులను త్వరగా జారీ చేస్తున్నారు.
ఇది బిల్డర్లకు ప్రాజెక్ట్‌లు ప్రారంభించడానికి ప్రేరణగా ఉండడంతో పాటు, పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతుంది.భారత్ ఫ్యూచర్ సిటీ ఒక పర్యావరణ హిత, స్మార్ట్, ఉద్యోగ కేంద్ర నగరంగా మారి రేపటి తరాలకు ఒక ఆదర్శ ప్రణాళికగా మారనుంది. హైదరాబాద్ అభివృద్ధి వేగాన్ని రెట్టింపు చేస్తూ, భవిష్యత్తు నగర నిర్మాణానికి మోడల్‌గా నిలవనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్‌మెంట్లు!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications