Bharat Electronics: మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని డిఫెన్స్ కంపెనీలకు మంచి కాలం వచ్చిందని చెప్పుకోవాలి. ఇండియన్ ఆర్మీ నుంచి భారీ ఆర్డర్లను పొందటంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ ర్యాలీని నమోదు చేస్తున్నాయి.
డిఫెన్స్ స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లలో బలమైన పెరుగుదల కనిపించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు గురువారం 4 శాతంపైగా పెరిగి రూ.163కి చేరి సరికొత్త రికార్డును నమోదు చేసింది. వాస్తవానికి భారత ఆర్మీ నుంచి రూ.580 కోట్లు విలువైన ఆర్డర్ పొందటంతో బూమ్ నమోదైంది. రాడార్ వ్యవస్థ కోసం కృత్రిమ అయస్కాంత కండక్టర్(AMC)ల సరఫరా ఆర్డర్‌ను కంపెనీ పొందింది.

BEL ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,300 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది. ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెప్టెంబర్ 15,2023న చివరిగా వెల్లడించినప్పటి నుంచి రూ.3,335 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందినట్లు తెలిపింది. ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్, అన్‌కూల్డ్ TI సైట్‌లు, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, పాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్‌ల కోసం వార్షిక నిర్వహణ ఒప్పందాలకు సంబంధించిన ఆర్డర్‌లను కంపెనీ పొందింది.

గత 11 నెలల్లో కంపెనీ షేర్లలో 85% పెరుగుదలను నమోదు చేసింది. జనవరి 30, 2023న డిఫెన్స్ కంపెనీ షేర్లు రూ.88.95 వద్ద ఉన్నాయి. ప్రభుత్వ కంపెనీ షేర్లు 7 డిసెంబర్ 2023న రూ.163కి చేరుకున్నాయి. గత 6 నెలల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు దాదాపు 40 శాతం పెరిగాయి. జూన్ 7, 2023న ప్రభుత్వ కంపెనీ షేర్లు రూ.118 వద్ద ఉండగా ప్రస్తుతం.. రూ.163కి చేరుకున్నాయి. గడచిన 5 ఏళ్ల కాలంలో షేర్లు 500% కంటే ఎక్కువ పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.26.80 నుంచి రూ.163కి పెరిగాయి.


Click it and Unblock the Notifications