Defence Stock: భారత్ గతంలో మాదిరిగా లేదు. దేశ రక్షణ, సుస్తిరతకు భద్రత చాలా కీలకమని గ్రహించిన మోదీ సర్కార్ అందుకోసం శరవేగంగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో దేశీయ డిఫెన్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లలో సోమవారం భారీ జంప్ నమోదైంది. బీఎస్ఈలో డిఫెన్స్ కంపెనీ షేర్లు 6.85 శాతం పెరిగి రూ.145కి చేరుకున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం నుంచి రూ.3,000 కోట్లకు పైగా విలువైన కంపెనీ దక్కించుకోవటమే కారణంగా నిలిచింది. ఇదే సమయంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వివిధ కార్యక్రమాలకు గ్రీన్‌లైట్ ఇవ్వడంతో నేడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ధర 4% మేర పెరిగింది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి రూ.2,118.57 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకుంది. సెన్సార్లు, ఆయుధ పరికరాలు, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ పరికరాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ రక్షణ సంస్థ ఈ ఆర్డర్‌ను పొందింది. ఈ ఆర్డర్ నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెసెల్స్ (NGMV)కోసం. దీనికి తోడు భారత్ ఎలక్ట్రానిక్స్ రూ.886 కోట్ల విలువైన ఇతర ఆర్డర్లను కూడా దక్కించుకుంది.
తాజా కాంట్రాక్టులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మెుత్తంగా రూ.14,384 కోట్లు విలువైన ఆర్డర్ బుక్ కలిగి ఉంది. తొలి త్రైమాసికంలో భారత్ ఎలక్ట్రానిక్స్ రూ.530.84 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ లాభాలు వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగాయి. అలాగే జూన్ తో ముగిసిన త్రైమాసికంలో మెుత్తం ఆదాయం రూ.3,510.8 కోట్లుగా నిలిచింది. డిఫెన్స్ స్టాక్ దూకుడు నేపథ్యంలో గత నెలలో 10 శాతానికి పైగా లాభపడింది. 2023లో ఇప్పటి వరకు కంపెనీ స్టాక్ 40 శాతానికి పైగా పెరిగింది.


Click it and Unblock the Notifications