దీర్ఘకాలంలో BFSI (బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్) మార్కెట్ లీడర్లుగానే కొనసాగుతాయని అంబిత్ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలోను ఆశాజనకంగా ఉండవచ్చునని అభిప్రాయపడింది. ఎందుకంటే ఈ రంగాలు త్వరగా కోలుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా కారణంగా BFSI రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వేగంగా వృద్ధి పథంలోకి వస్తాయని అంబిత్ అసెంట్ మేనేజ్‌మెంట్ సీఈవో సుశాంత్ బన్సాలీ చెప్పారు.

అధిక నిరాశావాదం
ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినా, 2001, 2014, నోట్ల రద్దు, డీహెచ్ఎఫ్ఎల్.. ఇలా ఏ అంశమైనా BFSI పైన ప్రభావం పడుతుందని అంబిత్ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ రంగాలు ఎక్కువగా దెబ్బతిన్నప్పటికీ అంతే వేగంగా బౌన్స్.. అంటే తిరిగి పుంజుకున్నాయని గుర్తు చేస్తున్నారు ఫండ్ మేనేజర్ ఐశ్వర్య దధీచ్. BFSI ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పారు. BFSIపై నిరాశావాదం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. మిగతా రంగాలతో పోలిస్తే వీటిపైనే ఎక్కువ నిరాశావాదం ఉందన్నారు.

ప్రతికూలతలు తుదిదశకు.. ఇక రికవరీయే
ఇప్పటికే ఈ రంగాలపై ప్రతికూలతలు అన్ని తుది దశకు చేరుకున్నాయని, ఇక నుండి సానుకూలతలు పెరిగి, మార్కెట్లో రికవరీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని సుశాంత్ బన్సాలీ అన్నారు. బీఎస్ఈ బ్యాంకెక్స్ ఇప్పటికే 33 శాతం తక్కువకే ఉందని, దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంటే వీటిలో పెరుగుదల కనిపిస్తుందన్నారు. కరోనా లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా ముగిస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి
మార్కెట్ తగ్గుతుందా, పెరుగుతుందా ఇప్పుడే చెప్పలేమని, కానీ కేసులు తగ్గుముఖం పడితే ర్యాలీకి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఊగిసలాటలో ఉంటాయని అభిప్రాయపడ్డారు. రాబోయే 3-4 నెలల కాలంలో జీడీపీ తగ్గడం, కార్పోరేట్ ఆదాయాలు క్షీణించడం లాంటి పరిస్థితులను చూస్తామని చెప్పారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు కనీసం 3 నుండి 5 ఏళ్ళ దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలన్నారు.

కార్పోరేట్ ఆదాయాలపై అధిక అంచనా
కార్పోరేట్ ఆదాయాల గురించి మాట్లాడుతూ... గత పదేళ్లలో 8 సంవత్సరాలు నిపుణులు కార్పోరేట్ ఆదాయాలను ఎక్కువగా అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్కువగా అంచనా వేయడం వల్ల 2015-16, 17-18 ఆర్థిక సంవత్సరాల్లో వరస్ట్‌గా ఉందన్నారు. FY11, FY19లలో తక్కువగా అంచనా వేయడం వల్ల ఫలితాలు పాజిటివ్‌గా 14 శాతం 4 శాతం ఉన్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications