Digital Arrest Scam: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో ప్రజలు సౌకర్యవంతమైన సేవలను పొందుతున్నప్పటికీ ప్రమాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం టెక్నాలజీని కొందరు నేరగాళ్లు ప్రజలను మోసం చేయటమే. ప్రజలను ప్రభుత్వాలు ఒకరకం స్కామ్ గురించి అవగాహన కలిగించే లోపే, మోసం చేసేందుకు మరిన్ని మార్గాలను వారు సృష్టించుకుంటున్నారు. అయితే ఈ మోసాలకు ఎక్కువగా చదువుకున్న వ్యక్తులే బలవటం వారి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ స్థాయిలను ప్రతిబింబిస్తోంది.
ఇటీవలి కాలంలో నేరగాళ్ల కొత్త స్కామ్ ప్రజలను బెంబేలిస్తోంది. "డిజిటల్ అరెస్ట్" పేరుతో జరుగుతున్న మోసాలు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు దేశంలో గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం కొన్ని రోజుల కిందట ఈ రకం మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందువల్ల దేశంలోని పౌరులకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రముఖ వార్తా సంస్థ వన్ ఇండియాతో పాటు గుడ్‌రిటర్న్ కలిసి పనిచేయటం ప్రారంభించింది.

అయితే అందరినీ గందరగోళానికి గురిచేస్తున్న అంశం అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? అన్నదే. ఇందులో నిందితులు సీబీఐ అధికారులు లేదా పోలీసు అధికారులమని చెప్పుకుంటూ, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అరెస్ట్ వారెంట్లు, ఇంటరాగేషన్ అంటూ ఆన్‌లైన్ లోనే మోసగాళ్లు పెద్ద గేమ్ ఆడుతుంటారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ వీడియో కాల్ లోనే పెద్ద లీగల్ సెటప్ వేసి నిజంగా అనిపించే స్థాయిలో నేరస్తులు బిహేవ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో పూర్తవుతుంది.
డిజిటల్ గవర్నమెంట్ పేరుతో నిందులు సామాన్యులను తప్పుచేశారంటూ ఒప్పించి డబ్బులు లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు సీబీఐ అధికారులుగా నటిస్తూ నకిలీ సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తుంటారు. ఇలాంటి మోసానికి గురేవ వ్యక్తి తనకు జరిగిన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ.. డిజిటల్ అరెస్ట్ అంటూ నిందితులు తనను రూ.7 కోట్లు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారని తద్వారా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఈ మోసగాళ్లు వ్యాపారులు, మహిళలనే కాకుండా జీతగాళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. సైబర్ స్కామ్‌ల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలోనే 30,000 కోట్లు. అలాగే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో 7,40,000 ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ప్రజలు ఏకంగా రూ.1,750 కోట్లు కోల్పోయినట్లు నివేదించబడింది.
స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి అనుకరించాల్సిన కొన్ని ఇమెయిల్‌లు లేదా SMSలలో సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. వీటి ద్వారా నిందితులు మీకు సంబంధించిన బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు మొదలైనవాటిని గ్రహించకుండా నిరోధించవచ్చు. అలాగే పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు రొటీన్, ఈజీ పద్ధతులు మానుకోవాలి. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు బ్యాంక్ అధికారిక అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి. అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ Google Play Store ఉపయోగించాలి. అన్నింటి కంటే ముఖ్యమైనది మీరు తప్పు చేశారంటూ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీసులను సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేయండి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications