ప్రపంచంలో అప్పులేనివాడే అసలైన అదృష్టవంతుడు అంటారు. ఎంతటి కుబేరుడికైనా ఎదో ఒక సందర్భంలో ఋణం అవసరం ఉంటుంది. ఇందుకు జెఫ్ బెజోస్ నుంచి మన ముకేష్ అంబానీ వరకు ఎవరూ అతీతులు కారు. అయితే, రుణాలు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. అవసరాన్ని బట్టి సంబంధిత ఋణం తీసుకోవటం సహజం. రుణాలు తీసుకునేందుకు బంగారం తాకట్టు పెట్టడం కూడా ఒక పద్ధతే. ఇది అనాదిగా భారతీయులకు తెలిసిన వ్యవహారమే. అయినా... ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ తీసుకోవటం అధికమైంది. మన వద్దనున్న గోల్డ్ తీసుకెళ్లి బంగారం తాకట్టు షాపులో ఇస్తే ఒక్క నిమిషంలో మనకు ఋణం మంజూరు చేస్తారు. ఎందుకంటే బంగారానికి అంతటి విలువ ఉంది మరి.
ఋణం కావాలనుకునేవారికి తొందరగా లభిస్తుంది ... అలాగే ఇచ్చే వారికి కూడా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్ లోన్ ఇచ్చేందుకు ఎవరూ వెనకాడరు. అందుకే భారతీయుల ఇంట్లో ఆహారం తర్వాత తప్పనిసరిగా ఉండేది బంగారమే. అత్యవసరాల్లో బంగారం కంటే మనల్ని బాగా ఆదుకునే మరో సాధనం లేదంటే అతిశయోక్తి కాదేమో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేందుకు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా మొహం చాటేస్తారేమో కానీ... బంగారం మాత్రం నేనున్నానంటూ కష్టాల కడలి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తుంది. ఋణం తీసుకోవటం మంచిదా.. కాదా అనేది కాసేపు పక్కన పెడితే గోల్డ్ లోన్ కావాలనుకునే వారికి మాత్రం ఒక బంగారమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.

అధిక ఋణం...
వారం పది రోజుల క్రితం వరకు కూడా బంగారం 10 గ్రాముల ధర రూ 40,000 లోపే పలికింది. కానీ అమెరికా - ఇరాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ 42,000 పలుకుతోంది. అంటే కేవలం వారం రోజుల్లో 5% రేటు పెరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ వాతావరం చల్లబడకుంటే... ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే రూ 45,000 కు కూడా చేరుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే.... మీకు గతంలో కంటే అధిక మొత్తంలో ఋణం లభిస్తుంది. ఎందుకంటే బంగారం రుణాలు దాని విలువ ఆధారంగానే ఇస్తారు కాబట్టి.

90% వరకు ...
గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఎందుకంటే అక్కడ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ బ్యాంకులు బంగారం విలువలో 50% నుంచి 60% నికి మించి ఋణం మంజూరు చేయవు. అదే ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి గోల్డ్ లోన్ సంస్థల్లో మాత్రం అధిక ఋణం లభిస్తుంది. బంగారం నాణ్యతను బట్టి, ఎంపిక చేసుకునే కాలపరిమితిని బట్టి ఈ సంస్థలు మొత్తం విలువలో 90% వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. అయితే, దానిపై వడ్డీ రేటు కూడా అధికంగానే ఉంటుంది. మనం వీలైనంత త్వరగా గోల్డ్ లోన్ తీర్చగలం అనుకుంటేనే ఇలాంటి పథకాల్లో చేరాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మీరు కట్టే వడ్డీలు తడిసి మోపెడయి... చివరకు బంగారాన్నికోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని, సమయానుకూలంగా వడ్డీ చెల్లిస్తే మేలని సలహా ఇస్తున్నారు.

సంక్షోభంలో బంగారమే బెటర్...
ప్రపంచంలోనే బంగారం అధికంగా వినియోగించే దేశాల్లో భారత దేశమే ముందువరుసలో ఉంటుంది. మనకు బంగారంపై ఉన్న విశ్వాసం అలాంటిది మరి. తరతరాలుగా మన భారతీయులు బంగారాన్ని ఒక అత్యవసర, విశ్వసనీయ పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తున్నారు. అందుకే దీన్ని కేవలం అలంకారానికి మాత్రమే పరిమితం చేయటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలాంటి సంక్షోభాలు ఎదురయినా సరే వెంటనే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని మరీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అందుకే... బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలను ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ఉపయోగించుకుంటారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications