Mutual Funds: లక్షను మూడింతలు చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్.. వీటిలో ఇన్వెస్ట్ చేశారా..?
స్టాక్ మార్కెట్ ద్వారా అనేకమంది ఎంతోకొంత సంపాదించుకోవాలని చూస్తుంటారు. అయితే దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఎంటర్ అయితే మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. తద్వారా మార్కెట్ పై ఎటువంటి అవగాహనా లేకుండానే పెద్ద మొత్తంలో రిటర్న్స్ జనరేట్ చేసుకునే అవకాశం లభిస్తోంది.
ఏదైనా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేముందు ఆయా కేటగిరీల రిటర్న్స్ పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈమధ్య మెరుగైన రాబడిని అందిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 5 ఏళ్లలో లక్షను రెండింతలు, మూడింతలు చేసిన మ్యూచువల్ ఫండ్స్ సైతం ఈ కేటగిరీలో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం 13 స్మాల్ క్యాప్ ఫండ్స్ 15 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. వీటిలో డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే బెంచ్ మార్క్ ఇండెక్స్ ను సైతం అధిగమించి, 5 ఏళ్లలో 3 రెట్లు రిటర్న్ జనరేట్ చేశాయి.
గత 5 ఏళ్ల రిటర్న్స్ ని పోల్చి చూస్తే.. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 28.29 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. అంటే లక్ష ఇన్వెస్ట్ చేస్తే 3.47 లక్షలు రిటర్న్ జనరేట్ చేసింది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 23.90 శాతం, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 23.59 శాతం, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 22.42 శాతం, ICICI ప్రుడెన్షియల్ స్మాల్‌క్యాప్ ఫండ్ 22.04 శాతం, SBI స్మాల్ క్యాప్ ఫండ్ 21.39 శాతం, DSP స్మాల్ క్యాప్ ఫండ్ 20.51 శాతం చొప్పున వార్షిక రాబడిని ఇచ్చాయి.
గమనిక: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ నిబంధనలకు లోబడి ఉంటాయి. ఆయా ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేముందు మీ ఫైనాన్షియర్ అడ్వైజర్ సలహా తీసుకోండి.


Click it and Unblock the Notifications