స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తో పాటు రివార్డు కూడా ఉంటుంది. స్మాల్ క్యాప్ మ్యూవచువల్ ఫండ్లలో ఎక్కువ కాలం పెట్టుబడి పెడితేనా రాబడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గత 3 సంవత్సరాల్లో 30 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఏమున్నాయో చూద్దాం...
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 5-స్టార్ రేటింగ్ పొందిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ఒక సంవత్సరంలో 7.91%, 3 సంవత్సరాలలో 37.78% వార్షిక SIP రాబడిని అందించింది. ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ ఫోర్ట్ పోలియోలో కన్స్యూమర్ స్టేపుల్స్, ఫైనాన్షియల్, మెటల్స్ & మైనింగ్, సర్వీసెస్, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి.
ఫండ్ టాప్ 5 హోల్డింగ్‌లో ITC, జిందాల్ స్టెయిన్‌లెస్, RBL బ్యాంక్, IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ ఉన్నాయి. ఈ ఫండ్‌లో ఏక మొత్తం మెత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనిష్ఠంగా రూ. 5000, SIP అయితే కనిష్ఠంగా రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. 28 ఫిబ్రవరి 2023 నాటికి దాని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) రూ. 3,302 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ వ్యయ నిష్పత్తి రూ. 0.62శాతంగా ఉంది.

టాటా స్మాల్ క్యాప్ ఫండ్: టాటా స్మాల్ క్యాప్ ఫండ్ కు వాల్యూ రీసెర్చ్ ద్వారా 4-స్టార్ రేటింగ్ ఉంది. ఇది 1 సంవత్సరంలో 14.26%, 3 సంవత్సరాలలో 30.88% వార్షిక SIP రాబడిని అందించింది. ఈ ఫండ్ ఈక్విటీ హోల్డింగ్ కింద, ఇది సర్వీసెస్ సెక్టార్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్, కన్స్యూమర్ స్టేపుల్స్, కెమికల్స్ మరియు మెటీరియల్స్‌లో పెద్ద పెట్టుబడులను కలిగి ఉంది.
టాప్ 5 హోల్డింగ్ స్టాక్‌లలో IDFC, రాడికో ఖైతాన్, రెడింగ్టన్, DCB బ్యాంక్, ఆల్కార్గో లాజిస్టిక్స్ ఉన్నాయి. ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడిని పెట్టాలంటే కనిష్ఠంగా రూ.5000 ఉండాలి. సిప్ ద్వారా పెట్టుబడి పెట్టాలంటే కనిష్ఠంగా రూ.500 ఉండాలి. 28 ఫిబ్రవరి 2023 నాటికి, దాని అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) రూ. 3,301 కోట్లుగా ఉంది. వ్యయ నిష్పత్తి రూ. 0.26 శాతంగా ఉంది.
Note: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. వీటిలో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications