తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. బెస్ట్ రక్షా బంధన్ గిఫ్ట్‌తో మహిళల మనసు దోచేయండి!
భారత్ లో పండుగల కోలాహలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ రక్షా బంధన్ కు ఉన్న ప్రాముఖ్యతే వేరు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా.. మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి వారిపై ప్రేమను వ్యక్తపరుస్తారు. పురుషులు కూడా తాము అమితంగా ప్రేమించే సోదరీమణులకు గిఫ్ట్స్ ఇచ్చి వారిని సంతోష పరుస్తుంటారు. అలా బహుమతిగా ఇవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఓ లుక్కేయవచ్చు.
బడ్జెట్ ధరలో మహిళలకు టూ వీలర్ గిఫ్ట్ ఇవ్వాలని భావించే వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అని చెప్పవచ్చు. FGPS ఎలక్ట్రికల్స్ కు రిలీజ్ చేసిన ఇ-డాల్ఫిన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని ధర కూడా కేవలం 30 వేలే (ఎక్స్ షోరూమ్ ప్రైస్) కావడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లగలిగే కెపాసిటీ దీని సొంతం.

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్, ఇండియా మార్ట్ నుంచి కూడా ఈ స్కూటర్ కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. పూర్తిగా బ్యాటరీ ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం తీసుకుంటుంది. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణించవచ్చు.
మార్కెట్ లో అందుబాటులో ఉన్న TVS, ఓలా, బజాజ్ వంటి కంపెనీల మోడళ్ల కంటే FGPS నుంచి వచ్చిన ఈ స్కూటర్ తక్కువ ధరకు లభిస్తోంది. అయితే కావాలనుకున్న మోడల్స్, ధర ఆధారంగా కొన్ని ఫీచర్లలో మార్పులు ఉంటాయని గమనించాలి. వీటితో పాటు కొనుగోలు సమయంలో ఆయా బ్యాంకు ఆఫర్లు అప్లై చేసి మరికొంత అదనపు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications