post office MIS scheme: మీ డబ్బుని పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిఒక్కరు సురక్షితమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని పై రిటర్న్స్ పొందాలనుకుంటుంటారు. కానీ తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో కొంతమంది స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడిగా పెడతారు కానీ ఇందులో రిస్క్ కూడా ఉంటుంది.

మీరు పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఇందుకు పోస్టాఫీస్ పెట్టుబడుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ నిర్వహిస్తుంది. వీటిలో ఒకటి, మీరు మీ భార్యతో కలిసి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు తరువాత ఇంట్లో కూర్చొని ప్రతి నెలా డబ్బు సంపాదించవచ్చు.
మీరు MISలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు (పోస్ట్ ఆఫీస్ మంథ్లి ఇన్కమ్ స్కిం), మీరు సింగిల్ అకౌంట్ అయితే రూ.1,000 నుండి రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్లో మీరు పెట్టుబడి పెట్టె గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు. ఈ పథకం ఏడాదికి 7.4% వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీ డబ్బు కూడా ప్రతి నెలా మీ బ్యాంకు అకౌంట్లో జమవుతుంది.
ఈ పథకం కింద పెళ్లి అయిన జంటలు లేదా భారభర్తలు జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. ఈ జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ఐదు సంవత్సరాల పాటు ప్రతినెల ఫిక్స్డ్ వడ్డీ రూ.9,250 లభిస్తుంది. ఈ వ్యవధి తర్వాత అసలు మొత్తం మీ బ్యాంక్ అకౌంటుకు తిరిగి జమ చేస్తారు.
రూ.15 లక్షలకి తక్కువ పెట్టుబడి పెడితే: మీరు ఈ పోస్టాఫీసు పథకంలో రూ.15 లక్షలు కాకుండా రూ.14 లక్షలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 8633 ఫిక్స్డ్ వడ్డీ మీ బ్యాంకు అకౌంట్కు వస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 14 లక్షలు కూడా మీ బ్యాంకు అకౌంటుకు బదిలీ చేస్తారు. ఈ స్కిం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పోస్టాఫీసు నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకం అని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం ఉంటుంది ఇంకా మీరు ప్రతి నెల హామీతో ఫిక్స్డ్ వడ్డీ పొందుతారు.
లాక్-ఇన్ పిరియడ్ అండ్ అత్యవసర విత్ డ్రా నియమాలు: మీరు MISలో లాక్-ఇన్ పీరియడ్ ఐదు సంవత్సరాలు. అయితే, కొన్ని షరతుల కింద ఈ వ్యవధికి ముందే మీరు మీ అకౌంట్ క్లోజ్ చేసి డబ్బు తీసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications