పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కిం. రిటైర్మెంట్ కోసం ఎక్కువ డబ్బు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అప్షన్. మీరు ప్రతినెల నెల ఇందులో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. అంతేకాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా డబ్బు కూడబెట్టుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో PPFలో అత్యధికంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా పెట్టుబడి పెట్టుకుంటే వెళ్తే 56 ఏళ్ల వయస్సులో దాదాపు రూ.93 లక్షల రిటైర్మెంట్ ఫండ్ పొందవచ్చు. అంతేకాదు ఈ పెట్టుబడిపై వచ్చే ఆదాయం ట్యాక్స్ ఫ్రీ కూడా.

పీపీఎఫ్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి: మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కనీసం రూ.500తో PPF అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీ అకౌంట్ అక్టీవ్ ఉండడానికి ప్రతి సంవత్సరం కనీసం మొత్తం జమ చేయాలి. ఈ పథకంలో మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఇంకా మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కూడా పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. అంతేకాకుండా పాత పన్ను విధానం ప్రకారం సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
ప్రస్తుతం PPF వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతం. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని మీరు ప్రతినెల లేదా ఒకేసారి జమ చేయవచ్చు. దింతో ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31న మీ అకౌంట్లో వడ్డీ జమ అవుతుంది. ఎక్కువ వడ్డీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి 5 మధ్య మీరు పెట్టుబడి పెట్టడం మంచిది.
PPF అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత మీరు మీ మొత్తం కార్పస్ విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మీ అకౌంట్ మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. మీరు డిపాజిట్లు చేయకుండా లేదా చేస్తూ కూడా పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే రెండు సందర్భాల్లోనూ మీకు వడ్డీ వస్తూనే ఉంటుంది.
రూ.1.55 కోట్ల కార్పస్ ఎలా పొందాలి : మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే, మీ మొత్తం పెట్టుబడి రూ.22,50,000 అవుతుంది. అంచనా ప్రకారం రూ.18,18,209 వడ్డీతో కలిపి మీ కార్పస్ రూ.40,68,209కి చేరుకుంటుంది. ఆ తర్వాత మీరు 5 సంవత్సరాల చొప్పున మూడుసార్లు మీ అకౌంట్ పొడిగిస్తూ ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడుతూ ఉంటే 30 సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి రూ.45,00,000 అవుతుంది. అంచనా వడ్డీ రూ.1,09,50,911తో కలిపి మీ కార్పస్ అక్షరాలా రూ.1,54,50,911కి చేరుకుంటుంది!
ఈ సమయంలో మీరు 60 శాతం కార్పస్‌ను విత్‌డ్రా చేసుకుంటే ఆ మొత్తం దాదాపు రూ.92 లక్షలకు పైగా ఉంటుంది. మిగిలిన రూ.61 లక్షలకు పైగా కార్పస్‌పై వచ్చే అన్యువల్ వడ్డీ దాదాపు రూ.4.7 లక్షలు ఉంటుంది. అంటే నెలకు దాదాపు రూ.39,000 కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాబట్టి మీరు 25 సంవత్సరాల వయస్సులో PPFలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 56 సంవత్సరాల వయస్సులోపు మీరు అనుకున్నది చేరుకోవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications