ఇటీవలి కాలంలో పిల్లల కోసం చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసమని చిల్ర్డన్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.ఈ తరహా ఇన్వెస్ట్ మెంట్స్ పిల్లల చదువులు, పెళ్లి వంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2020-2024 మధ్య చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఏకంగా 142 శాతం పెరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
మంచి లాభాలు
కొన్ని నివేదికల ప్రకారం చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ లోని మొత్తం పెట్టుబడులు సుమారు రూ.20 వేల కోట్లు దాటాయి. గత ఐదు సంవత్సరాల్లోనే ఈ పెట్టుబడులు డబుల్ అయ్యాయి. ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉండడంతో ఈ ఫండ్స్ మంచి లాభాలు కూడా ఇస్తున్నాయి. గత ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఫండ్స్ 22 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. గడిచిన మూడేళ్లుగా ఈ ఫండ్స్ సగటున 12 నుంచి 14 శాతం రిటర్న్స్ ఇస్తూ వస్తున్నాయి.

చైల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే..
పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన మ్యూచువల్ ఫండ్స్ ను చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ అనొచ్చు. ఇవి 5 సంవత్సరాల లాక్ ఇన్ పిరియడ్‌తో ఉంటాయి. అంటే, ఐదేళ్ల వరకు వీటిని వెనక్కు తీసుకోవడానికి కుదరదు. వీటి యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ రిటర్న్స్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫండ్స్ డిజైన్ చేస్తారు.
లాభాలివే..
ప్రస్తుతం దేశంలో విద్యా ద్రవ్యోల్బణం అంటే విద్య కోసం అయ్యే ఖర్చు ఏటా 11 నుంచి 12 శాతం పెరుగుతుంది. అలాగే చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తున్నారు. వాటికి కూడా బాగానే ఖర్చవుతుంది. ఇలాంటి వాళ్లకు ఈ ఫండ్స్ బాగా ఉపయోగపడతాయి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పట్నుంచే వారి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వారికి ఇరవయ్యేళ్లు వచ్చే సరికి మంచి ఫండ్ రెడీ అవుతుంది. అలాగే పిల్లల పెళ్లిళ్లు లేదా ఫ్యూచర్ లో ఎదురయ్యే ఇతర ఊహించని ఖర్చుల కోసం కూడా ఈ ఫండ్ ను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్ ముందునుంచే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెరుగుతున్నారు. అందుకే ఇప్పుడు చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి.
బెస్ట్ ఫండ్స్ ఇవే..
చిల్డ్రన్స్ ఫండ్ కేటగిరీలో కొన్ని బెస్ట్ పెర్ఫామింగ్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో SBI మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ ఫండ్.. మందుంది. ఇది గత ఐదేళ్లలో సగటున 35.38 శాతం రిటర్న్స్ ను ఇచ్చింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ ఫండ్, (HDFC Children's Fund), ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ చైల్డ్ ఫండ్(ICICI Prudential Child fund) వంటివి కూడా గత 5 సంవత్సరాల్లో సగటున 18 శాతం రిటర్న్స్ ఇస్తున్నాయి. అయితే వీటిలో 5 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. వీటిలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా నెలవారీ సిప్(SIP) కూడా కట్టుకోవచ్చు.


Click it and Unblock the Notifications