దుబాయ్ అనగానే చాలామంది ఒక్కసారైన వెళ్ళాలి అనుకుంటారు. కానీ అక్కడే స్థిరపడాలని, వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. అదే గోల్డెన్ వీసా ప్రోగ్రామ్. ఈ వీసా ఉంటే ఏకంగా 10 ఏళ్ల పాటు యూఏఈలో హాయిగా ఉండొచ్చు. అయితే ఈ వీసా ఎవరికి ఇస్తారో తెలుసా ? ఇప్పుడు ఎక్కువ మందికి ఈ అవకాశం కల్పిస్తూ యూఏఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

నిజానికి యూఏఈ 2019లోనే ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసింది. మంచి టాలెంట్ ఉన్నవాళ్లను, పెట్టుబడి పెట్టేవాళ్లను తమ దేశంలో ఉంచుకోవాలనేది వాళ్ల ప్లాన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించారు. తాజాగా 5 కొత్త కేటగిరీ కింద కూడా గోల్డెన్ వీసా దక్కించునే ఛాన్స్ ఇచ్చింది. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యంగా నర్సులు.. అవును, మీరు విన్నది నిజమే. ఎవరైతే దుబాయ్‌లో 15 ఏళ్లకు పైగా నర్సులుగా పనిచేశారో వాళ్లకు యూఏఈ 10 ఏళ్ల గోల్డెన్ వీసా ఇస్తోంది. అంతేకాదు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే మంచి టీచర్లకు కూడా ఈ వీసా వర్తిస్తుంది. ఇంకా టాలెంట్ చూసి విద్యా ప్రమాణాలు పెంచడంలో హెల్ప్ చేస్తే చాలు. ఇక సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్లు, సినిమాలు తీసేవాళ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవచ్చు. వీళ్లకు స్పాన్సర్ కూడా అవసరం లేదు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అండ్ UAE రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టారు.
ఇంకా ఇ-స్పోర్ట్స్ ప్లేయర్లు, గేమింగ్ ప్రొఫెషనల్స్‌కు కూడా యూఏఈ తలుపులు తెరిచింది. దుబాయ్ ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ 2033లో భాగంగా ఈ ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే వీళ్లకు కనీసం 25 ఏళ్లు ఉండాలి. లగ్జరీ షిప్స్ ఉన్నవాళ్లకు కూడా గోల్డెన్ వీసా ఇస్తున్నారు. కనీసం 40 మీటర్ల పొడవున్న ప్రైవేట్ బోటు ఉంటే చాలు. ఈ వీసా బోట్ల తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లకు కూడా వర్తిస్తుంది.
మొత్తానికి యూఏఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌తో ప్రపంచంలోని టాలెంట్ మొత్తాన్ని దాని దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద బిజినెస్ చేసేవాళ్లకు మాత్రమే ఈ వీసా వచ్చేది. కానీ ఇప్పుడు ఎన్నో రంగాల వాళ్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ మీరూ ఈ కేటగిరీల్లో ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా యూఏఈలో 10 ఏళ్లు హాయిగా ఉండొచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications