Agro Multibagger: ప్రముఖ ఇన్వెస్టర్ కన్నేసిన మల్టీబ్యాగర్.. లక్షను రూ.68 లక్షలు చేసింది.. ఓ లుక్కేయండి..

Agro Multibagger: ప్రస్తుతం అగ్రీ కెమికల్స్ వ్యాపారంలో ఉండే కంపెనీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. తమ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందిస్తున్నాయి. తాజాగా మరో స్టాక్ సైతం ఊహించని లాభాలతో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.

ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడి..

ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడి..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్ పరిశ్రమలో అద్భుత పనితీరును కనబరుస్తున్న Best Agrolife కంపెనీ స్టాక్ గురించే. అవును ఈ కంపెనీ స్టాక్ గత 5 సంవత్సరాలుగా అనూహ్యంగా మంచి రాబడులను అందించింది. ఈ క్రమంలో షేర్ ధర రూ.18 నుంచి రూ.1,240లకు పెరిగింది. ఈ కాలంలో బెస్ట్ ఆగ్రోలైఫ్ షేర్లు 6500 శాతానికి పైగా రాబడిని అందించింది. అయితే ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఇప్పుడు ఈ మల్టీబ్యాగర్ అగ్రికల్చర్ స్టాక్ లో వాటాలను కొనుగోలు చేశారు.

 3.18 లక్షల షేర్ల కొనుగోలు..

3.18 లక్షల షేర్ల కొనుగోలు..

స్టాక్ మార్కెట్‌లో 'బిగ్ వేల్'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కన్ను బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ స్టాక్ పై పడింది. తాజాగా ఆగస్ట్ 30, 2022న కచోలియా ఈ షేర్లను బల్క్ డీల్‌లో 3.18 లక్షల షేర్లను కొనుగోలు చేశాడు. ఆశిష్ కచోలియా కంపెనీ స్టాక్‌ను మార్కెట్ ధర రూ.940.88కి కొనుగోలు చేశారు. ఆయన ఈ కంపెనీ షేర్లలో దాదాపు రూ.29.91 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు.

భారీగా రాబడి..

భారీగా రాబడి..

బెస్ట్ ఆగ్రోలైఫ్ షేర్లు సెప్టెంబర్ 10, 2017న BSEలో రూ.18.15 స్థాయి వద్ద ఉంది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 01, 2022న BSEలో రూ.1,240 స్థాయిలో ట్రేడవుతోంది. ఒక వ్యక్తి 5 ఏళ్ల క్రితం కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వారు రూ.68.31 లక్షలు పొంది ఉండేవారు.

లిస్టింగ్ సమయం నుంచి..

లిస్టింగ్ సమయం నుంచి..

బెస్ట్ ఆగ్రోలైఫ్ షేర్లు ప్రారంభం నుంచి దాదాపు 7760% రాబడిని అందించింది.29 ఏప్రిల్ 2016న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు రూ.15.74గా ఉంది. కంపెనీ షేర్లలో 52 వారాల గరిష్ఠ ధర రూ.1,399.70 వద్ద ఉంది. ఇదే సమయంలో కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.711.90గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+