ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో గత ఏడాదిగా పెట్టుబడిదారులు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లకు దూరంగా ఉంటున్నారు. స్మాల్ క్యాప్ కేటగిరీ గత సంవత్సరం 2.19 శాతం రాబడి అందించింది. అయితే ప్రస్తుతం, స్వల్పకాలిక పరిస్థితుల కారణంగా స్మాల్ క్యాప్ ఫండ్లలో పెట్టబుడి నిర్ణయం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాల్లో ఎనిమిది స్మాల్ క్యాప్ ఫండ్లు 40 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి.
మూడేళ్లుగా మార్కెట్‌లో 21 స్మాల్ క్యాప్ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది స్మాల్ క్యాప్ పథకాలు 40% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ కేటగిరీలో అగ్రగామిగా ఉంది. సవాలు మార్కెట్, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన 63.44% రాబడిని అందించింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. ఈ ఫండ్ మూడేళ్లలో 46 శాతం రాబడి ఇచ్చింది.

HSBC స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లల్లో 42.94 శాతం, కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 42.75 శాతం, HDFC స్మాల్ క్యాప్ ఫండ్ 41.77,టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 40.91, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.85, ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ 40.05 శాతం రాబడి అందించాయి.స్మాల్ క్యాప్ ఫండ్లు చాలా చిన్న కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం, ఈ పథకాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 250 కంటే తక్కువ ర్యాంక్ ఉన్న స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి.
ఈ స్టాక్‌లు పెట్టుబడిదారులకు మంచి రాబడి అందించగలవు. ఫండ్ మేనేజర్ గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న కంపెనీని గుర్తించడంలో విజయవంతమైతే, అది చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. స్మాల్ క్యాప్ నుంచి డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. ఈ పథకాలు చాలా అస్థిరంగా ఉంటాయి. ప్రతికూల రాబడిని కూడా అందిస్తాయి. స్మాల్ క్యాప్ ఫండ్లలో 10 సంవత్సరాలు సుదీర్ఘ పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచించాలు. అలా అయితేనే రాబడి వస్తుందని చెబుతున్నారు.
Note: ఈ వార్త మా సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications