ఇన్వెస్ట్‌మెంట్ కింగ్ వారెన్ బఫెట్‌కు చెందిన రియాల్టీ బ్రోకరేజ్ బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్ భారత ప్రాపర్టీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియా పేరుతో హైదరాబాద్ సహా పలు ప్రముఖ నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఒరెండాతో జత కట్టింది. అందుకే బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియాతో సంయుక్తంగా కీలక రియాల్టీ మార్కెట్ సేవల్లోకి వస్తోంది.
బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్ ఒరెండా ఇండియా ప్రధానంగా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, గోవా, అయోధ్య తదితర కీలక ప్రాపర్టీ మార్కెట్ల పైన దృష్టి సారించింది. భారత రియాల్టీ రంగం గత ఏడాది గ్లోబల్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షించింది. 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు.

బెర్క్‌షైర్ హాత్‌వే హోమ్ సర్వీసెస్‌ను భారత్‌లోకి తీసుకు రావడం ఆనందంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు మరింత విస్తరిస్తామని, ఇందులో భాగంగా భారత్‌లోని ప్రధాన రియాల్టీ మార్కెట్‌లో సేవలు అందిస్తామని బెర్క్ షైర్ హాత్ వే హోమ్ సర్వీసెస్ పేర్కొంది. వెయ్యి మందితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications