భయపెడుతున్న బెంగళూరు రియల్ ఎస్టేట్! ఇంటర్నెట్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్!
సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో రియల్ ఎస్టేట్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడి ఇంటి అద్దెలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సమస్య మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది. చాలామంది బెంగళూరు నివాసితులు అక్కడి రియల్ ఎస్టేట్ ధరల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దీని గురించి ఇంటర్నెట్ లో డిబేట్ నడుస్తోంది.

ఇంటర్నెట్ వేదికగా రెడిట్ ప్లాట్ ఫామ్ లో రకరకాల డిస్కషన్స్ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు అందులో జరుగుతున్న బెంగళూరు రియల్ ఎస్టేట్ టాపిక్ అందర్నీ ఆకర్షిస్తోంది. బెంగళూరులో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల గురించి నెటిజన్లు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇదెలా మొదలైందంటే..
ఇలా మొదలైంది
తాజాగా రెడిట్ లో ఒక యూజర్ ఇలా రాసుకొచ్చాడు.. "నేను బెంగళూరులో ఆరేళ్లుగా ఉంటున్నాను. ఇక్కడి రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తే భాధేస్తోంది. ఎక్కడ చూసినా ధరలు భారీగా పెరిగిపోయాయి. వైట్‌ఫీల్డ్, సర్జాపూర్ లేదా యెలహంక వంటి ప్రాంతాలలో 2BHKలు 1 కోటి రూపాయలకు పైగా ఉన్నాయి. అద్దెలు కూడా క్రేజీగా పెరిగాయి" అంటూ డిస్కషన్ మొదలుపెట్టాడు. దీంతో బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట పై చర్చ మొదలైంది. అసలు ఈ మార్కెట్ స్థిరంగా ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
బుడగలా మారుతుందా?
బెస్ట్ ఐటీ సిటీగా పాపులర్ అవుతున్న బెంగళూరులో ధరల పెరుగుదల అనేది కలవరపెడుతుందని మరో బెంగళూరు నివాసి రెడ్టిట్ లో స్పందించాడు. "బెంగళూరు ఇప్పటికీ ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది. అయితే ఈ స్థానం స్థిరంగా ఉంటుందా? లేదా త్వరలో బుడగలా కూలిపోతుందా?" అని రాసుకొచ్చాడు. ఇలా బెంగళూరు రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ పెరుగుతూ పోతోంది. "బెంగళూరులో నివసించడం బాగుందా? వేరొక చోటుకి షిఫ్ట్ అవుదామనుకుంటున్నారా.." ఇలా పలు రకాల ప్రశ్నలతో రెడిట్ కన్వర్జేషన్ నిండిపోయింది. "బెంగళూరు రియల్ ఎస్టేట్ నిజంగా విలువైనదేనా?" అనే హెడింగ్ తో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
విభిన్న అభిప్రాయాలు
ఈ పోస్ట్ పై రెడిట్ యూజర్స్ రకరకాలుగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొంతమంది ఇది డిమాండ్ అండ్ సప్లై వంటిది అంటుంటే కొందరు రియల్ ఎస్టేట్ దారి తప్పుతోంది అంటున్నారు. కొందరు ధరలు పెరుగుతూనే ఉంటాయి అని అభిప్రాయపడుతుంటే మరికొందరు "ఖచ్చితంగా ధరలు తగ్గుతాయని, త్వరలోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అవుతుంది" అని అంటున్నారు.
మరికొంత మంది అంత ధరలు పెట్టాలా? వద్దా? అన్నది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. మీరు బెంగళూరులో ఉండి రిటైర్ అవ్వాలనుకుంటుంటే ధరలు పెరుగుతూనే ఉంటాయని గుర్తుంచుకోండి అంటున్నారు. ఇక మరికొంతమంది బెంగళూరులోని ప్రజలు తమ ఫ్లాట్‌లను అమ్మడం, కొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అయితే ఈ చర్చ ఇక్కడితే ఆగలేదు కొత్తగా వస్తున్న యూజర్లు కూడా ఈ డిస్కషన్ లో పాల్గొంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఏదైమైనా బెంగళూరు రియల్ ఎస్టేట్ ధరలు మాత్రం అక్కడి నివాసితులకు భయాందోళనలు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications