Bengaluru Yellow Line Metro : బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సంగతి చెప్పనక్కరలేదు. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే మళ్లీ ఎప్పుడు ఇంటికి చేరుకుంటామో తెలియదు. ఇక వర్షం పడిందంటే ఆ రోజు నరకమేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలు త్వరలో కొంతవరకు తగ్గనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న నమ్మ మెట్రో ఎల్లో లైన్ ను ప్రారంభించనున్నారు.
ఈ ఎల్లో లైన్ ఆగస్టు 15 గడువుకంటే ముందే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు ఉన్న 19.15 కి.మీ పొడవైన ఈ మెట్రో మార్గం ద్వారా నగర వాసుల కష్టాలు తీరనున్నాయి. నగరం దక్షిణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్నిఈ ఎల్లో లైన్ అందించనుంది.ఎలక్ట్రానిక్ సిటీ ఐటి ఉద్యోగులు, విద్యార్థులు, దక్షిణ బెంగళూరులో నివసించే ప్రయాణికులకు ఈ లైన్ చాలా ప్రయోజనం కానుంది.

మొత్తం 16 స్టేషన్లు - ఆధునిక సౌకర్యాలు: ఈ ఎల్లో లైన్‌లో మొత్తం 16 స్టేషన్లు ఉంటాయి.ఆర్‌వి రోడ్, రాగి గుడ్డ, జయదేవ హాస్పిటల్, బిటిఎమ్ లేఅవుట్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, బొమ్మన హళ్లి, హోంగ్రా సాండ్ర, కుడ్లు గేట్, సింగసంద్ర, హోసా రోడ్, బెరతెన అగ్రహార, ఎలక్ట్రానిక్ సిటీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోనప్పన అగ్రహారం, బొమ్మ గొడ్రా అగ్రహారం వంటి లైన్లను కలుపుతూ మెట్రో ప్రయాణించనుంది.ఈ లైన్‌లో నూతన డ్రైవర్‌లెస్ రైళ్లు నడవనున్నాయి. ప్రారంభ దశలో 3 రైలు సెట్‌లు 25 నిమిషాల వ్యవధిలో నడవనున్నాయి.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రకారం, రైళ్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ఇక ఈ మెట్రోలో ఛార్జీలు రూ. 10 నుంచి ప్రారంభమై, గరిష్టంగా రూ. 90 వరకు ఉంటాయి.ఈ ఎల్లో లైన్ ముఖ్యంగా సిల్క్ బోర్డ్ జంక్షన్ గుండా వెళుతుంది, సిల్క్ బోర్డ్ ఏరియా బెంగళూరులో అత్యంత రద్దీ ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఇరుక్కుపొతో ఇక అతని ప్రయాణం నరకమేనని చెప్పుకోవచ్చు. ఈ ఎల్లో లైన్ రాకతో రోజువారీ ట్రాఫిక్‌లో గడిపే సమయాన్ని ప్రయాణికులు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సిటీ, హోసూర్ రోడ్, బిటిఎమ్ లేఅవుట్ ప్రాంతాల నుంచి నగర కేంద్రానికి వేగంగా చేరుకునే అవకాశం ఈఎల్లో లైన్ ద్వారా కలగనుంది.
ఇతర లైన్లకు త్వరలో కనెక్షన్: ఇక ఈ మెట్రో ముందు ముందు మరిన్ని లైన్లను కలుపుకుంటూ ముందుకు సాగనుంది. జయదేవ హాస్పిటల్ స్టేషన్ - పింక్ లైన్‌కు ఇంటర్‌చేంజ్ పాయింట్ రానుంది. అయితే పింక్ లైన్ పూర్తి అయిన తర్వాత ఇది అందుబాటులోకి రానుంది. సెంట్రల్ సిల్క్ బోర్డ్ స్టేషన్ - బ్లూ లైన్‌కు కనెక్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే బ్లూ లైన్ ప్రారంభం తర్వాత ఇది రానుంది. ఇది సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కలుపుతుంది.
రూ. 5,057 కోట్ల వ్యయంతో నిర్మాణం: ఈ ఎల్లో లైన్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం, కేంద్రంతో కలిసి మొత్తం రూ. 5,057 కోట్లు ఖర్చు పెట్టింది. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక స్టేషన్ డిజైన్, సౌకర్యవంతమైన టికెటింగ్ సిస్టమ్‌తో ఈ లైన్ నిర్మించడం జరిగింది. తాజాగా రేపు మోదీ బెంగళూరు పర్యటనలో నమ్మ మెట్రో ఫేజ్ 3కి శంఖుస్థాపన కూడా చేయనున్నారు. బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి, పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచడంలో ఈ ఫేజ్ 3 కీలకంగా మారనుంది. ఇక ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications