బెంగళూరులో మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది అన్న నమ్మకం అందరికీ ఉంది. కానీ యెల్లో లైన్‌లో ప్రయాణం ఇప్పుడు ప్రయాణికులకు కష్టాలు, నిరాశ, ఆగ్రహం కలిగించే ఒక సమస్యగా మారింది. ట్రైన్ కోసం 25 నిమిషాలు వేచి ఉండటం, వచ్చే ట్రైన్‌లో జనం నిండి ఉండటం, లేకపోతే స్టేషన్ నుంచి బయటకు రావడానికి రూ. 50 జరిమానా కట్టడం ఇవన్నీ జనాలకి ఇబ్బంది కలుగుతుంది.

బెంగళూరులో నమ్మ మెట్రో పసుపు లైన్‌లో ప్రయాణం సులభం కంటే కష్టం అయింది. ఈ లైన్‌లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు మూడు ప్రధాన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందుగా, ట్రైన్ కోసం సుమారు 25 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. తర్వాత, వచ్చే ట్రైన్ లోపల జనంతో గుమిగూడి, అడుగు పెట్టడం కష్టం అవుతుంది. చివరగా, రైలు రాక విసుగుతో స్టేషన్ బయటకు వెళ్ళాలనుకుంటే రూ. 50 'ఓవర్స్టే' జరిమానా చెల్లించాల్సి వస్తోంది.
ఈ సమస్యను సిల్క్ బోర్డ్ స్టేషన్‌లో నిఖిల్ భట్ బాగా ఎదుర్కొన్నారు. బెల్లందూరు నుండి బస్సు ద్వారా సిల్క్ బోర్డ్‌కి చేరిన భట్, ఆర్వీ రోడ్ ఇంటర్‌చేంజ్‌కి వెళ్లేందుకు మెట్రో ఎక్కాలని ప్లాన్ చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆయన స్మార్ట్ కార్డ్‌ను టాప్ చేసినప్పుడు, ప్రయాణికుల సమాచారం బోర్డులో "తదుపరి ట్రైన్ 18 నిమిషాల్లో వస్తుంది" అని చూపింది.
కానీ ప్లాట్‌ఫారం ఇప్పటికే ప్రయాణికులతో నిండిపోయింది. ట్రైన్ రాగానే లోపలికి అడుగు పెట్టడం అసాధ్యం. తర్వాతి ట్రైన్ 30 నిమిషాల తర్వాత మాత్రమే రాబోతుండటంతో, భట్ స్టేషన్‌ని వదలి బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆటోమేటెడ్ ఫేర్ గేట్ వద్ద సిబ్బంది వారిని రూ. 50 జరిమానా చెల్లించకుండా బయటకు వెళ్ళనివ్వలేదు. అదనంగా కనీస కిరాయి రూ. 9.50 కూడా వసూలు చేశారు. భట్ ఇలా చెప్పారు "నేను అసలు ప్రయాణం చేయలేదు. కేవలం 20-22 నిమిషాలు స్టేషన్‌లో ఉండడం మాత్రమే చేసా. కానీ, రైళ్లు అరగంటకొకసారి వస్తే, మరియు ట్రైన్‌లో స్థానం లేకుంటే కూడా జరిమానా విధించడం అన్యాయం."
ఈ సంఘటన సోషల్ మీడియాలో షేర్ కావడంతో, పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ట్రైన్ ఫ్రీక్వెన్సీ 25-30 నిమిషాలకోసారి ఉంటే, ఓవర్‌స్టే జరిమానా విధించడం సరైంది కాదు" అని వారు అభిప్రాయపడ్డారు.
BMRCL నియమాల ప్రకారం, స్మార్ట్ కార్డ్ లేదా టోకెన్‌తో 'పెయిడ్ ఏరియా'లోకి ప్రవేశించిన తర్వాత 20 నిమిషాల్లో స్టేషన్ వెళ్ళలేకపోతే జరిమానా విధించబడుతుంది.
కానీ యెల్లో లైన్‌లో రైలు ఫ్రీక్వెన్సీ 25 నిమిషాలకోసారి ఉండటంతో, ఈ నియమం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. భట్ ఈ జరిమానా రసీదు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అనేక ప్రయాణికులు BMRCLపై విమర్శలు చేశారు. వారు ఫ్రీక్వెన్సీ పెరిగే వరకు ఓవర్స్టే జరిమానా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ తమ నిర్ణయాన్ని సమర్థించింది. చీఫ్ PRO బి.ఎల్. యశ్వంత్ చవాన్ మాట్లాడుతూ "ఈ నియమం కొత్తది కాదు. ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉంది. పసుపు లైన్‌లో ట్రైన్లు 25 నిమిషాల వ్యవధితో నడుస్తున్నాయని మేము ముందే ప్రకటించాము. ప్రయాణికులు మాత్రం, ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెరిగేవరకు రూ. 50 ఓవర్స్టే ఫైన్ వేయకూడదని, నియమంలో సరళత అవసరమని భావిస్తున్నారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications