బెంగళూరు నగరం మరో కొత్త ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకుంది. ఈసారి ఇది స్టార్టప్‌ల గురించో, ట్రాఫిక్ గురించో కాదు! ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో చోటు సంపాదించింది. దీని గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచంలోని బెస్ట్ సిటీస్ - 2026 నివేదికలో బెంగళూరు టాప్ 30 నగరాలలో ఒకటిగా నిలిచింది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ (Resonance Consultancy) అనే ప్రఖ్యాత గ్లోబల్ అర్బన్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 270కి పైగా ప్రధాన నగరాలను అంచనా వేసి ఒక లిస్ట్ ను ప్రకటిస్తుంది. ఈసారి ఆ లిస్ట్ లో బెంగళూరు కూడా చోటు దక్కించుకుంది.
క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారంగా..
నగరాల్లో ఉండే క్వాలిటీ లైఫ్ ఆధారంగా ఈ లిస్ట్ రెడీ చేస్తారు. ముఖ్యంగా ఈ లిస్ట్ లో సిటీ ఎకానమీ, టూరిస్ట్ అట్రాక్షన్స్, ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, రవాణా, పర్యావరణం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ లిస్ట్ లో లండన్ వరుసగా 11వ సారి ప్రపంచంలో నెం.1 నగరంగా నిలిచింది. అయితే ఈసారి జాబితాలో భారతదేశం కూడా తనదైన ముద్ర వేసింది. లిస్ట్ లో 29వ ర్యాంక్ లో బెంగళూరు చోటు సంపాదించిది. బెంగళూరు.. భారతదేశపు టెక్ రాజధానిగా మాత్రమే కాకుండా గ్రీన్ ఫీల్డ్, ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్ , ఫుడ్, టూరిజం వంటి అంశాల్లో కూడా గుర్తింపు పొందింది. బెంగళూరులోని డీప్-టెక్ ల్యాబ్‌లు, వైల్డ్ లైఫ్ పార్కులు, సందడి చేసే బ్రూవరీల.. ఇలా నగరంలోని అన్ని అంశాలు కలబోసినట్టు ఉన్నాయి.

స్పెషల్ ర్యాంకింగ్స్
ఇక బెస్ట్ సిటీ సంగతి అటుంచితే కొన్ని స్పెషల్ కేటగిరీస్ లో కూడా బెంగళూరు తదనైన ముద్ర వేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ అట్రాక్షన్స్ విభాగంలో బెంగళూరు ప్రపంచంలోనే టాప్ 1 లో ఉంది. వైల్డ్‌లైఫ్ పార్కులు, థీమ్-పార్క్స్ వంటి సదుపాయాల కారణంగా ఈ ర్యాంక్ లభించింది. ఇక డైనింగ్ కల్చర్ విభాగంలో బెంగళూరు ప్రపంచంలోనే టాప్ 3 నగరంగా నిలిచింది. ఇకపోతే షాపింగ్ విభాగంలో బెంగళూరు టాప్ 6 గా నిలిచింది. సిటీలో లగ్జరీ స్టోర్‌ల నుంచి లోకల్ షాపింగ్ స్టోర్స్ వరకూ షాపింగ్ కు బెంగళూరు చాలా అనుకూలంగా ఉండడమే దీనికి కారణం. వీటితోపాటు సైట్స్ & ల్యాండ్‌మార్క్‌ల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకు సాధించింది.
హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే..
ఈ లిస్ట్ లో టాప్ 30లో బెంగళూరు ఉంటే టాప్ 100లో మరో మూడు భారతీయ నగరాలు ఉన్నాయి. ముంబై నగరం 40 వ ర్యాంకులో ఉండగా ఢిల్లీ 54 స్థానాన్ని దక్కించుకుంది. సైట్స్ & ల్యాండ్‌మార్క్స్ విభాగంలో ముంబై గ్లోబల్‌గా 3 వ స్థానాన్ని పొందింది. ఇదే విభాగంలో ఢిల్లీ టాప్ 5లో నిలిచింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. గ్లోబల్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ 82 వ స్థానంలో ఉంది. షాపింగ్ విభాగంలో సిటీ.. టాప్ 20లో ఉండగా సైట్స్ & ల్యాండ్‌మార్క్స్ విభాగంలో గ్లోబల్‌గా 2వ స్థానాన్ని దక్కించుకుంది.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications