SBI: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. SBIకి వ్యతిరేకంగా బెంగళూరు మహిళ న్యాయపోరాటంలో విజయం సాధించిందని తెలుస్తోంది. సదరు మహిళ వ్యవహారంలో రూ. 54.09 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. బెంగుళూరు అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ద్వారా ఫిర్యాదుదారు అయిన మహిళ ధరణికి రూ. లక్ష, వ్యాజ్యం ఖర్చుల కింద మరో రూ. 20,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది.

కోర్టు ఆగ్రహం..
బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా ధరణి (36) ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారని వినియోగదారుల కోర్టు గుర్తించింది. ఇది SBIకు చెందిన వైట్‌ఫీల్డ్ బ్రాంచ్ సేవా లోపం, అన్యాయమైన వాణిజ్య అభ్యాసానికి సమానమని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం.

అసలు ఏమి జరిగింది..
మే 20, 2021న తన భర్త రూపేష్ రెడ్డి మరణించడంతో ధరణి వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. భర్త మరణం కారణంగా తానకు వస్తున్న సంపాదనతో తన మైనర్ పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, ఇంటి నిర్వహణ వల్ల లోన్ చెల్లించలేకపోతున్నట్లు పేర్కొంది. తాను పూర్తిగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దరఖాస్తు ఫారమ్‌లో మొదట ఎంచుకున్న బీమా కవరేజీపై పూర్తిగా ఆధారపడుతున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది

ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోవటంతో..
అయితే.. SBI దీనిని ఆమోదిస్తూ అధికారాన్ని అందించలేదని, అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తాన్ని చెల్లించలేకపోయిందని కోర్టులో వాదించింది. SBI లైఫ్ ఇన్సూరెన్స్‌కు ఎటువంటి ప్రీమియం చెల్లించనందున లోన్ తీసుకున్న వ్యక్తుల జీవితాలకు ఇన్సూరెన్స్ చేయలేదని బ్యాంక్ వాదించింది.

కోర్టు ఏమందంటే..
లోన్ మెుత్తాన్ని రద్దు చేయాలని ధరణి అనేక సార్లు బ్యాంకును అభ్యర్థించినా.. ఎస్బీఐ అలా చేయలేదని తన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ వాదనను కోర్టు తప్పపట్టింది. ఎందుకంటే హౌసింగ్ లోన్ ప్రక్రియలో భాగంగా "SBI లైఫ్-రిఎన్ రక్ష" కింద హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కవరేజీకి సంబంధించిన అవసరాలు పూర్తి కాలేదన్న బ్యాంక్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.


Click it and Unblock the Notifications