తెలుగు సాంప్రదాయంలో బొట్టుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మహిళల అందాన్ని మాత్రమే కాదు, వారి మనసు, ఆత్మవిశ్వాసం, సాంప్రదాయపు గుర్తును ప్రతిబింబిస్తుంది. పండుగలు, వివాహాలు, నిత్య జీవితంలోనైనా బొట్టుని వాడటం సంప్రదాయం. ఇది కేవలం డెకరేషన్ కాదు, సాంస్కృతిక గుర్తుగా, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచే గుర్తుగా ఉంటుంది. పండుగలైనా, పెళ్లిళ్లైనా, నిత్యజీవితమైనా... బొట్టు మహిళల ఆభరణాల్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది.
బొట్టు అంటే మహిళలకి చాలామందికి కేవలం ఒక చిన్న "ఫినిషింగ్ టచ్" మాత్రమే. కానీ మేఘనా ఖన్నా దృష్టిలో ఇది అంత సింపుల్ విషయం కాదు. ఆమె బొట్టుని ఫ్యాషన్, సంస్కృతి, వ్యక్తీకరణ ఈ మూడు కలిపిన ఒక స్టేట్‌మెంట్‌గా మార్చేశారు. డిసెంబర్ 2022లో బెంగళూరులో ప్రారంభమైన "ది బిందీ ప్రాజెక్ట్", ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు ధరించే బ్రాండ్‌గా ఎదిగింది. కరీనా కపూర్, కాజోల్, సోనమ్ కపూర్, తమన్నా భాటియా వంటి ప్రముఖులు ఈ హ్యాండ్‌క్రాఫ్ట్ బొట్టులను ధరిస్తున్నారు.

మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ & ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. తర్వాత ఒక క్వాలిటేటివ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో ఉద్యోగం చేపట్టారు. కానీ అది ఎక్కువ కాలం సాగలేదు. 2001 జూలై 4న ఉద్యోగంలో చేరి, 2002 జూలై 5న రాజీనామా చేశారు. "నేను నా సొంతంగా ఏదో చేయాలనుకున్నా," అని ఆమె చెప్పారు. దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలు చాలా సాధారణమై ఉన్నప్పటికీ, ముక్కు పోగులు మాత్రం ఎవరూ పెద్దగా తయారు చేయడం లేదని ఆమె గమనించారు. దీంతో జోధ్‌పూర్‌కు రైల్లో ప్రయాణించి, అక్కడి కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 నుంచి 2020 వరకు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. కానీ COVID-19 సమయంలో వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది.
2022లో ఒక స్నేహితురాలితో మాట్లాడుతుండగా, అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు గురించి చర్చ జరిగింది. అక్కడే మేఘనాకు ఒక ఆలోచన వచ్చింది. "బొట్టు పెట్టుకోవడం ఒకప్పుడు చాలా విలువైనవి. కానీ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నవి ఎక్కువగా సాదాసీదా, వాడేసి పారేసేవే ఉంటున్నాయి. ఇవి కూడా జ్యువెలరీలా ఒక స్టేట్‌మెంట్‌గా ఎందుకు మారకూడదు?" అక్కడి నుంచే "ది బిందీ ప్రాజెక్ట్" పుట్టుకొచ్చింది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
మేఘనా రూ.5 లక్షలతో ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టింది. లెవిటేట్ నుండి మిగిలిన జ్యువెలరీ పీసెస్, బేస్‌లు, డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి వాటితోనే కొత్త బిందీలను తయారు చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇద్దరు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, వారితో కలసి బిందీలు తయారు చేయడం ప్రారంభించారు. పాప్-అప్ షోలు, కల్చరల్ ఈవెంట్లలో బ్రాండ్‌ను పరిచయం చేశారు. ప్రజల ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉండేది "బిందీలు కూడా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అవుతాయా!" అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం ది బిందీ ప్రాజెక్ట్ ఆర్డర్లు ఎక్కువగా WhatsApp, Instagram ద్వారా వస్తున్నాయి. టెక్నాలజీ ఆటోమేషన్, వెబ్సైట్ వంటి అంశాలపై ఇంకా పని జరుగుతోంది. ఇప్పటివరకు 1,500 మందికి పైగా కస్టమర్లు ఈ బిందీలను ఆర్డర్ చేశారు. FY24లో సుమారు రూ. 10 లక్షల ఆదాయం వచ్చింది. FY25లో అది రెట్టింపు అయి రూ. 20 లక్షలకు చేరింది. ప్రతి ఆర్డర్ సగటు విలువ రూ. 1,500 దాంట్లో డిజైన్, ప్యాకేజింగ్, డెలివరీ ఖర్చులు తీసేసి మిగిలేది లాభం. ప్రతి బిందీ ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తిని చూసే వాళ్లను కూడా ఆకట్టుకోవాలి అని మేఘనా చెబుతారు. ఫెస్టివ్, లెదర్, టెక్స్టైల్, కాంటెంపరరీ వంటి విభాగాల్లో ఆమె డిజైన్లు ఉన్నాయి. అమాని, దుర్గా, కాలి, కాళ్యాణి, పౌలోమీ వంటి కలెక్షన్లు బ్రాండ్‌కు ప్రత్యేకతను తెచ్చాయి.
ఒక సాధారణ బిందీని ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మార్చిన మేఘనా కథ అనేది సృజనాత్మకత, ధైర్యం, సంస్కృతిపై ఉన్న ప్రేమకు ఉదాహరణ. ఇప్పుడు బొట్టు కేవలం "ఫినిషింగ్ టచ్" మాత్రమే కాదు ఇది ఒక స్టైల్, ఒక స్టేట్‌మెంట్ గా మారుతుంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!



Click it and Unblock the Notifications