బెంగళూరులో రూ. 1.4 లక్షలు vs ఉదయ్‌పూర్‌లో రూ. 40 వేలు.. ఏది బెటర్?

మంచి జీతం, చేతి నిండా డబ్బు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ, మనం ఉండే నగరాన్ని బట్టి ఆ డబ్బు విలువ మారుతుందని మీకు తెలుసా? అవును, సరిగ్గా ఇదే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్' (Reddit) లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బెంగళూరు (Bengaluru) లో నెలకు రూ. 1.4 లక్షలు సంపాదించినప్పటి కంటే, తన సొంతూరైన ఉదయ్‌పూర్‌లో రూ. 40 వేలు సంపాదిస్తున్నప్పుడే ఎక్కువ రిచ్‌గా, ప్రశాంతంగా ఫీల్ అవుతున్నానంటూ ఒక నెటిజన్ తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేశాడు.

Bengaluru vs Udaipur Cost of Living Salary Breakdown Viral Reddit Post

లక్షల్లో జీతం వచ్చినా.. నెలాఖరుకు జీరో!

ఆ యూజర్ 'సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "కొన్నేళ్ల క్రితం నేను బెంగళూరులో పనిచేసేటప్పుడు నా చేతికి నెలకు రూ. 1.4 లక్షల జీతం వచ్చేది. పేపర్‌పై చూడటానికి ఇది చాలా పెద్ద మొత్తమే. కానీ నెలాఖరు వచ్చేసరికి నా అకౌంట్‌లో ఆరు అంకెల జీతం ఉన్న ఫీలింగ్ అస్సలు ఉండేది కాదు" అని చెప్పుకొచ్చాడు.

ఆయన షేర్ చేసిన బెంగళూరు నెలవారీ ఖర్చుల లెక్కలు ఇలా ఉన్నాయి..

  • ఇంటి అద్దె (1BHK): రూ. 30,000
  • గ్రోసరీస్, నిత్యావసరాలు: రూ. 6,000
  • పనిమనిషి, లాండ్రీ: రూ. 3,000
  • వైఫై, కరెంట్ బిల్లు: రూ. 3,000
  • స్విగ్గీ, జొమాటో ఫుడ్: రూ. 7,000
  • క్యాబ్‌లు, ప్రయాణ ఖర్చులు: రూ. 5,000
  • వీకెండ్ పార్టీలు, సోషలైజింగ్: రూ. 8,000

ఇవి కాకుండా అమెజాన్ ఆర్డర్లు, క్విక్ కామర్స్ యాప్స్ (బ్లింకిట్, జెప్టో వంటివి), కాఫీలు, లగ్జరీ కొనుగోళ్ల రూపంలో కంటికి కనిపించకుండా చాలా డబ్బులు ఖర్చయిపోయేవి. ఒక పెద్ద మెట్రో సిటీలో కేవలం 'బతకడానికి' (Existing) మాత్రమే ఇంత భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అతను వాపోయాడు. ఆఫీస్ ఒత్తిడి వల్ల అలసిపోయి, కంఫర్ట్ కోసం తెలియకుండానే ఎక్కువ డబ్బులు తగలేస్తామని అన్నాడు.

బెంగళూరు కెరీర్ ఇచ్చింది.. కానీ ప్రశాంతతను తీసేసుకుంది!

అయితే బెంగళూరు నగరాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదని సదరు యూజర్ స్పష్టం చేశాడు. బెంగళూరు తనకు కెరీర్ గ్రోత్, ఎక్స్‌పోజర్, నెట్‌వర్కింగ్ , ఇండిపెండెన్స్‌ను ఇచ్చిందని ఒప్పుకున్నాడు. కానీ, ఒక స్టేజ్ వచ్చాక ఎంత సంపాదిస్తున్నా మానసికంగా విపరీతమైన అలసట మిగులుతోందని గ్రహించాడు.

ఉదయ్‌పూర్‌కు వెళ్లాక మారిన సీన్..

ఆ తర్వాత అతను తన సొంతూరైన ఉదయ్‌పూర్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ స్టార్టింగ్‌లో కేవలం రూ. 40 వేల జీతమే వచ్చినా, చాలా రిచ్‌గా అనిపించిందట. సొంత ఇల్లు ఉండటం వల్ల అద్దె భారం తగ్గింది, ఫ్యామిలీ తోడుంది, ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ దొరుకుతోంది. ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం, పెట్స్‌తో గడిపే సమయం దొరకడంతో మెంటల్ పీస్ దొరికిందని చెప్పాడు. అనవసరపు ఖర్చులు తగ్గడంతో చాలా సులభంగా డబ్బులు సేవ్ అవుతున్నాయని అన్నాడు.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

ఈ పోస్ట్‌పై ఇంటర్నెట్‌లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "సొంత ఇల్లు, వండి పెట్టే అమ్మ ఉంటే ఆ మాత్రం సేవింగ్స్ అవ్వడం సహజమే.. ఆ ఫ్యామిలీ సపోర్ట్‌ను కూడా లెక్కల్లో వేయాలి" అని ఒకరు కామెంట్ చేయగా.. మరో యూజర్ మాత్రం, "నేను కూడా టైర్-1 సిటీ నుంచి మా విలేజ్‌కు వచ్చేసి రిమోట్ జాబ్ (Work from Home) చేసుకుంటున్నాను. ఇకపై ఇండియాలోని ఏ పెద్ద సిటీకి వెళ్లను. నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాను, డబ్బు కూడా బాగా మిగులుతోంది" అని సపోర్ట్ చేశాడు. మొత్తానికి ఈ పోస్ట్ మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరినీ తమ లైఫ్‌స్టైల్‌పై ఆలోచించేలా చేస్తోంది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+