ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు నివసించటానికి అనువైన నగరం గురించి కీలక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో దిల్లీకి చెందిన దీనిపై స్పందించారు. పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఈ మూడు నగరాల్లో ఏది నివాసానికి అనుకూలంగా ఉంటుందనే చర్చలో చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది టెక్కీలు ఏ నగరంలో సెటిల్ అవ్వాలో తెలియక అయోమయంలో ఉంటుండగా దానికి చక్కటి వివరణను ఇక్కడ పంచుకున్నారు.
ప్రస్తుతం తాను గడచిన మూడేళ్లుగా దిల్లీలో నివసిస్తున్నానని.. అయితే బెంగళూరుకు మారాలని కోరుకుంటుండగా చాలా మంది తనకు బెంగళూరు ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని చెబుతున్నట్లు రెడిట్ లో పోస్టు చేశాడు. తనకు ఎక్కువగా స్నేహితులు లేరని ఈ విషయంపై తనకు సహాయం చేయాలని కోరగా ఈ పోస్ట్ వేగంగా వైరల్ అయ్యింది. దీనిపై ప్రజలు స్పందిస్తూ.. బెంగళూరు, పూణేల్లో తాను నివసించానని అక్కడ ట్రాఫిక్ కి తగినట్లుగా రోడ్లు ఉండవని పేర్కొన్నాడు. అయితే హైదరాబాదులో ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానికి తగిన రోడ్లు ఉంటాయన్నాడు. హైదరాబాదులో జస్ట్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ సాఫీగానే ప్రయాణం సాగుతుందని సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఇదే క్రమంలో పూణేకు చెందిన మరో వ్యక్తి స్పందిస్తూ నగరంలో తక్కువగా స్టార్టప్స్ ఉన్నాయని, నగరంలో ఇన్ ఫ్రా కూడా అద్వాన్నంగా ఉందని పేర్కొన్నాడు. పూణేకు మాత్రం షిఫ్ట్ కావొద్దని సూచించాడు. తనకు పూణేలో ఇల్లు ఉండటం వల్లే నివసిస్తున్నానని లేకుంటే హైదరాబాద్ వెళ్లిపోయేవాడినని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో మరో వ్యక్తి స్పందిస్తూ హైదరాబాద్-పూణేల్లో జీవితం దాదాపుగా ఒకేలా ఉంటుందని అన్నాడు. ఇక్కడ రెండు నగరాల్లో బాషకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని అయితే బెంగళూరులో కన్నడ సమస్య ఉంటుందన్నాడు. పూణేలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుందని వెల్లడించాడు.
ఇదే క్రమంలో మరో వ్యక్తి స్పందిస్తూ.. పూణే, హైదరాబాద్ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, రెండు ప్రదేశాలలో కూడా చాలా కంపెనీలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. బెంగళూరులో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ భాషా సమస్యల కారణంగా బయటి వ్యక్తిలా భావిస్తారని పేర్కొన్నాడు. పూణే లేదా హైదరాబాద్‌లో మీరు వివక్షకు గురికారని వెల్లడించాడు. మెుత్తం మీద హైదరాబాద్, పూణేలు బెంగళూరు కంటే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.
చాలా కాలంగా కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే వాదన తీవ్రంగా వినిపిస్తోంది. దీనికి అక్కడి ప్రభుత్వం కూడా అనుకూలంగా చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల్లో మాత్రం వేరే ప్రాంతాల వారు తమ రాష్ట్రానికి వచ్చి తమ ఉపాధి అవకాశాలను దోచుకుపోతున్నారనే భావజాలం మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. కొందరు ఉత్తరాది ప్రజలు కూడా కన్నడిగుల ఆలోచన సరైనదే అని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గ్లోబలైజేషన్ వల్ల ప్రయోజనం పొందుతోంటే కర్ణాటకలో మాత్రం ప్రజలు అర్హతను బట్టి ఉద్యోగాలు కాదు స్థానికులకే ఉద్యోగాలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చలు కొనసాగిస్తున్నారు. ఇది ఇతర ప్రాంతాల ప్రజలకు బెంగళూరులో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగిస్తోంది.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!



Click it and Unblock the Notifications