భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం బిజినెస్ పరంగానే కాకుండా ఆహారం, సంస్కృతి , జీవనశైలి విషయంలో కూడా నిరంతరం పోలికలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా విడుదలైన 'వీ ఆర్ సిటీ 2026' (WeAreCity 2026) నివేదిక ఈ చర్చను డేటా ఆధారంగా విశ్లేషించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లుగా మారిన ఈ రెండు నగరాల్లో ఏది ఎక్కడ ముందంజలో ఉందో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులు 2019 నుండి 2024 మధ్య కాలంలో దేశంలోని టాప్ 7 నగరాల్లో అదనంగా చేరిన ప్రైమ్ ఆఫీస్ స్పేస్ లో 53 శాతం వాటా ఈ రెండు నగరాలదే. అంతేకాకుండా, దేశీయ విమాన సర్వీసుల్లో సగం, అలాగే ప్రధాన రంగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో 40-50 శాతం వాటాను బెంగళూరు (Bengaluru) , హైదరాబాద్ కలిగి ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో టాప్ 8 నగరాల్లో నమోదైన కొత్త కంపెనీల్లో ప్రతి నాలుగు కంపెనీల్లో ఒకటి ఈ రెండునగరాల నుండే రావడం గమనార్హం.
బెంగళూరు ఎక్కడ ముందంజలో ఉంది?
స్టార్టప్ రాజధానిగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో బెంగళూరు సుమారు $42.3 బిలియన్ల స్టార్టప్ ఫండింగ్ ను ఆకర్షించగా, హైదరాబాద్ కేవలం $1.3 బిలియన్లకే పరిమితమైంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో బెంగళూరుకు వస్తున్న నిధులు హైదరాబాద్ కంటే 72 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. పేటెంట్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) , హై ఎండ్ టెక్ రోల్స్ లో బెంగళూరు గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 14 వ స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ వేగంగా పుంజుకుంటోంది!
అయితే, ఆఫీస్ స్పేస్ విషయంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఐదేళ్లలో బెంగళూరు 69 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను జోడిస్తే, హైదరాబాద్ 66 మిలియన్ చదరపు అడుగులతో దాదాపు సమానంగా నిలిచింది. ఇక్కడ అద్దెలు బెంగళూరు కంటే 15 శాతం తక్కువగా ఉండటం, ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం హైదరాబాద్ కు కలిసొచ్చే అంశం. కొత్త కంపెనీల ఏర్పాటులో కూడా 2024-25లో హైదరాబాద్ బెంగళూరుతో సమవుజ్జీగా నిలిచింది.
జీవనశైలిలో మార్పులు ప్రజల ఖర్చు చేసే విధానంలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రజలు ఇల్లు, లోన్లు, నిత్యావసరాలపై ఎక్కువ దృష్టి పెడుతుంటే, బెంగళూరు (Bengaluru) ప్రజలు విలాసాలు, వినోదంపై ఖర్చు చేస్తున్నారు. పని గంటల విషయానికి వస్తే, హైదరాబాద్ లో అర్థరాత్రి వరకు ప్రయాణాలు , వారాంతపు పనులు ఎక్కువగా ఉంటున్నాయి, బెంగళూరు వర్క్ ఫోర్స్ మాత్రం ఉదయం గంటల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మొత్తానికి, ఏ నగరానికీ ఆ నగరం తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్లో డ్రైవర్ లేని పాడ్ టాక్సీలు! ఆ ఏరియా వాళ్లకు పండగే!

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం.. కర్ణాటకలో పలు జిల్లాలు నీటి కొరతతో విలవిల..

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Bengaluru: బెంగళూరులో బతకాలంటే ఇంత అవుతుందా? వైరల్ అవుతున్న కపుల్ మంత్లీ బడ్జెట్!

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్లో ఉన్నారేమో చూసుకోండి!



Click it and Unblock the Notifications