బెంగళూరు టు విజయవాడ కేవలం 4 గంటలేనా? రూట్ మ్యాప్ చూస్తే షాక్ అవుతారు!
బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే అబ్బా చాలా టైం పడుతుంది అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని సూపర్ ఫాస్ట్ చేయడానికి ఒక అదిరిపోయే గ్రీన్‌ఫీల్డ్ హైవే వస్తోంది. అదే NH-544G. దీనివల్ల బెంగళూరు, విజయవాడ మధ్య దూరం ఏకంగా 110 కిలోమీటర్లు తగ్గిపోనుంది. అంతేకాదు, ప్రయాణ సమయం కూడా దాదాపు 3 నుంచి 4 గంటల వరకు కలిసి వస్తుంది. అంటే ఇకపై గంటల కొద్దీ జర్నీ చేయాల్సిన అవసరం లేదన్నమాట!

ఈ కొత్త హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
ఈ సరికొత్త బెంగళూరు-విజయవాడ హైవే శ్రీసత్యసాయి జిల్లాలోని కోడికొండ చెక్‌పోస్ట్ దగ్గర, కోడూరు గ్రామం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడ మొదలై ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ముఖ్యమైన జిల్లాల మీదుగా సాగుతుంది. శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల గుండా వెళ్తూ.. చివరికి అద్దంకికి దగ్గరలోని ముప్పవరం గ్రామం వద్ద ముగుస్తుంది. ఈ రూట్ వల్ల ఎప్పటినుంచో సరైన రోడ్డు కనెక్టివిటీ లేని ఎన్నో వెనుకబడిన గ్రామాలకు మహర్దశ పట్టబోతోంది.
రెండు పెద్ద నేషనల్ హైవేలకు లింక్!
ఈ ప్రాజెక్ట్ లో అసలైన హైలైట్ ఏంటో తెలుసా? బెంగళూరు , హైదరాబాద్ నగరాలను కలిపే NH-44 ని, అలాగే చెన్నై , విజయవాడను కలిపే NH-16 ని ఈ కొత్త హైవే ఒకదానితో ఒకటి స్మూత్‌గా కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ సరుకు రవాణా చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. టైం సేవ్ అవ్వడంతో పాటు బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
వైఎస్ఆర్ కడప జిల్లాకు బంపర్ ఆఫర్!
ఈ మొత్తం హైవే ప్రాజెక్టులో మన కడప జిల్లాకు భారీగా లాభం చేకూరనుంది. ఎందుకంటే ఈ రోడ్డు జిల్లాలోని దాదాపు 12 మండలాల మీదుగా వెళ్తుంది. పులివెందుల, వేముల, వేంపల్లి, వీఎన్ పల్లి, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, బి.మఠం, బి.కోడూరు, పోరుమామిళ్ల మీదుగా సుమారు 123.5 కిలోమీటర్ల మేర ఈ హైవే సాగనుంది.
కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి చెప్పిన వివరాల ప్రకారం.. ఈ జిల్లా పరిధిలో రూ.5,377.72 కోట్ల పెట్టుబడితో ఆరు నిర్మాణ ప్యాకేజీలుగా పనులు జరగనున్నాయి.
భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి?
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం హైవే కోసం 2,750 హెక్టార్ల భూమిని సేకరిస్తుండగా, ఒక్క కడప జిల్లాలోనే 1,020 హెక్టార్ల భూమిని సేకరించారు. ఈ ప్రాజెక్ట్‌ను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, వన్యప్రాణుల అనుమతులు (Stage-II forest and wildlife clearances) కూడా వచ్చేసాయి. కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు చకచకా జరిగిపోతున్నాయి. త్వరలోనే బెంగళూరు ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇవ్వబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!


Click it and Unblock the Notifications