ట్రాఫిక్ రద్దీకి ప్రసిద్ధి చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరం ఇప్పుడు సరికొత్త దశలోకి అడుగుపెట్టబోతోంది. 117 కిలోమీటర్ల పొడవైన పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) ప్రాజెక్ట్‌ను కొత్త పేరుతో బెంగళూరు బిజినెస్ కారిడార్ గా ఆమోదిస్తూ..నగర రద్దీ సమస్యను తగ్గించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం . ఈ ప్రాజెక్ట్‌ను బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఇది రెండు సంవత్సరాల లోపు పూర్తి కానుందని అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్ట్ వివరాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ మాట్లాడుతూ..బెంగళూరు నగరం ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ట్రాఫిక్ తగ్గించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. దాదాపు 1,900 కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతాయని నాకు తెలుసు. కానీ ప్రభుత్వం వారు ఆశించిన దానికంటే ఎక్కువ పరిహారం అందిస్తుంది. ఇది కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒకటని తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారిడార్ ప్రారంభమైన తర్వాత Bengaluru నగర ట్రాఫిక్‌లో దాదాపు 40 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా. ఎందుకంటే హైవేలు, పారిశ్రామిక మండలాల మధ్య ప్రయాణించే వాహనాలు ఇకపై నగర కేంద్రాన్ని దాటవలసిన అవసరం ఉండదు. దీనివల్ల నగర ప్రధాన రహదారులపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. భూసేకరణ అంశంపై కూడా డికె శివకుమార్ స్పష్టతనిచ్చారు. కొంతమంది భూ యజమానులు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తే.. ప్రభుత్వం పరిహారం మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ భూమినీ డీ-నోటిఫై చేయమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
మొదట్లో రూ. 27 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రూ. 10 వేల కోట్ల కంటే తక్కువలో పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఎక్కువ మంది రైతులు నగదు చెల్లింపుల బదులు భూమి ఆధారిత పరిహారాన్ని ఎంచుకోవడంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భూసేకరణపై ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కొత్త పరిహార ప్యాకేజీని రూపొందించింది.
ఇందులో అక్టోబర్ 2023 రేట్ల ప్రకారం పట్టణ ప్రాంతాలకు మార్గదర్శక విలువకు రెండింతలు, గ్రామీణ ప్రాంతాలకు మూడు రెట్లు నగదు పరిహారం ఇవ్వనున్నారు. అదనంగా అభివృద్ధి హక్కుల బదిలీ (TDR), అదనపు అంతస్తు విస్తీర్ణ నిష్పత్తి (FAR/FSI), పెద్ద స్థలాలను కోల్పోయిన భూ యజమానులకు సమీప లేఅవుట్లలో అభివృద్ధి చేసిన భూమి కేటాయింపు వంటి సౌకర్యాలు ఉంటాయి. వాణిజ్య భూముల విషయంలో ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లు లేదా నగదు రూపంలో పరిహారం అందజేయబడుతుంది.
బెంగళూరు బిజినెస్ కారిడార్ కేవలం ట్రాఫిక్ ఉపశమన చర్య మాత్రమే కాదు. ఇది నగర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇచ్చే ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. హైవేలు, పారిశ్రామిక ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల మధ్య మెరుగైన కనెక్టివిటీతో బెంగళూరు నగరం ఒక ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మారనుంది. అధికారులు చెబుతున్నట్లుగా.. ఈ కారిడార్ నగర రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, కొత్త వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications