బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! ఈ ప్రాజెక్ట్‌తో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం!
Bengaluru Tunnel Road Project: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెబ్బాల్ ఫ్లైఓవర్ (Hebbal Flyover), మెక్రి సర్కిల్ (Mekhri Circle) మధ్య రద్దీని తగ్గించడానికి రూ. 2,215 కోట్ల వ్యయంతో చిన్న ట్విన్-టన్నెల్ రోడ్ (Twin-Tunnel Road) అలాగే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డి.కె. శివకుమార్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్‌కు కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ రద్దీ మార్గం బెంగళూరు విమానాశ్రయం (Bengaluru Airport) కనెక్టివిటీకి అత్యంత కీలకం.

ప్రాజెక్ట్ వివరాలు: ఎక్కడ, ఎలా నిర్మిస్తారు?
ఈ ప్రాజెక్టును గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారి (NH)ని విస్తరించడానికి స్థలం లేకపోవడంతో, ప్రభుత్వం టన్నెల్ నిర్మాణానికి మొగ్గు చూపింది.
కీలక నిర్మాణ ప్రాంతాలు:
- మెక్రి సర్కిల్ అండర్‌పాస్: వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా మెక్రి సర్కిల్ వద్ద బళ్లారి రోడ్డు మధ్యలో ఒక అండర్‌పాస్ నిర్మించబడుతుంది.
- GKVK క్యాంపస్‌లో భూగర్భ మార్గం: హెబ్బాల్ లేక్ చుట్టూ భూమి అందుబాటులో ఉన్నందున.. గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర (GKVK) క్యాంపస్ పరిధిలోని భూమిని కూడా ఈ ప్రాజెక్టులో ఉపయోగించుకోనున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ రూట్ నిర్మించబడుతుంది.
- హెబ్బాల్ లేక్ రోడ్: హెబ్బాల్ సరస్సుకి ఇరువైపులా కూడా రోడ్డు నిర్మాణం జరుగుతుంది.
భూసేకరణ ఖర్చును కేవలం రూ. 25 కోట్లకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎందుకంటే మార్గంలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలోనే ఉంది.
టన్నెల్ రోడ్ ఎందుకు?
ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరించడానికి స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల రోడ్ల విస్తరణ కష్టం అని తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రసంగంలోనే బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru Traffic) సమస్యను సొరంగ మార్గాల ద్వారా పరిష్కరిస్తామని ప్రకటించింది. ఈ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా సమర్థించారు. ఈ టన్నెల్ రోడ్లలో అన్ని రకాల వాహనాలను అనుమతిస్తారు. ముఖ్యంగా టూవీలర్స్ ను అనుమతించేలా అదనపు షార్ట్ ట్రాన్సిటరీ లెంగ్త్ అండర్‌గ్రౌండ్ అండర్‌పాస్ నిర్మాణాన్ని కూడా ఆమోదించారు.
ఇది నిజంగా బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో చాలావరకూ రద్దీ తగ్గుతుంది. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది.


Click it and Unblock the Notifications