నలభై వేలు సంపాదించడానికి నెలంతా కష్టపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటిది రోజుకి ఏకంగా లక్ష సంపాదిస్తున్నాడు బెంగళూరులోని ఒక మోమోస్ సెల్లర్. అతని దగ్గర మోమోస్ తింటూ అతని ఆదాయం గురించి ఆరా తీశాడు ఒక ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్. తీరా అతడు చెప్పిన ఆదాయాన్ని చూసి షాక్ అయ్యాడు. దాని గురించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ బెంగళూరులో తెగ ట్రెండ్ అవుతుంది.

బెంగళూరు లాంటి రద్దీ సిటీలో రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇడ్లీ దోశల నుంచి న్యూడిల్స్, మోమోస్ వరకూ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అమ్ముడవుతుంటాయి. అలాంటిదే కేకే మోమోస్ కూడా. బెంగళూరులోని రోడ్డు పక్కన ఉండే కేకే మోమోస్ అనే ఒక మోమోస్ స్టాల్ ఆ ఏరియాలో చాలా ఫేమస్ ఫుడ్ స్టాల్. రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ ఇక్కడ వ్యాపారం మాత్రం లక్షల్లో జరుగుతుంది. ఈ మోమోస్ సెల్లర్ తో ఒక రోజు గడిపి తన నెలవారీ ఆదాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్. ఆ క్రియేటర్ చెప్తున్న దాని ప్రకారం మోమోస్ ద్వారా ఆ వ్యక్తి నెలకు దాదాపు రూ. 30 లక్షలు సంపాదిస్తాడట. అంటే రోజుకు దాదాపు రూ. లక్ష - ఇది సాధారణ గ్రాడ్యుయేట్ జీతం కంటే ఎక్కువ అని అతను పేర్కొన్నాడు.
రోజుకు ఎంత వస్తుందంటే..
కేకే మోమోస్ అనేది చాలా చిన్న మోమోస్ స్టాల్. కానీ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ ఒక గంటలో 100 నుంచి 120 ప్లేట్ల మోమోలు అమ్ముడవుతాయి. ఒక రోజులో సుమారు వెయ్యి ప్లేట్ల మోమోలు అమ్ముతారట. ఒక ప్లేట్ మోమోస్ ధర రూ. 110 రూపాయలు చొప్పున వెయ్యి ప్లేట్లు అంటే రోజుకి రూ. లక్ష ఆదాయం వస్తుంది. అయితే దానికి తగ్గట్టే ఆ మోమోస్ సెల్లర్ కృషి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్లేట్ల మోమోస్ ను ప్రిపేర్ చేయడం, రుచిని మెయింటెన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. అతనికి కష్టానికి తగ్గట్టే అతను సంపాదిస్తున్నాడు అని ఆ క్రియేటర్ పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా రెస్పాన్స్
ఇక ఆ మోమోస్ సెల్లర్ సంపాదన గురించి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ " నేను ఒక సంవత్సరంలో కూడా అంత సంపాదించలేను" అని రాశాడు. మరొకరు " ప్లేట్ కు రూ.110 పెట్టి ఎవరు కొంటున్నారు?" అని అడగారు. మరొకరు "ఒక గంటలో, అతను 118 ప్లేట్ల మోమోలను అమ్మాడా? నిజమేనా?" అని రాశాడు. మరొకరు "అతను పన్ను చెల్లిస్తాడా?" అని అడుగుతన్నారు. ఇలా మొత్తంగా బెంగళూరులోని ఒక మోమోస్ సెల్లర్ ఆదాయం అక్కడి ఐటీ ప్రొఫెషనల్స్ తో సమానంగా ఉందంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే!
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications