బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు చెక్.. పార్కింగ్ కోసం పైసలియ్యాల్సిందే.. టోయింగ్ వ్యవస్థ మళ్లీ లైవ్ లోకి..

భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకమేనని చెప్పవచ్చు. ట్రాఫిక్ రద్దీ సమస్యకు రోజు రొజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

నగరంలో గతంలో అమలులో ఉన్న టోయింగ్ వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టడంతో పాటుగా.. పే అండ్ పార్క్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు. అక్రమ పార్కింగ్, రోడ్డు పక్కన ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

బెంగళూరులో వాహనాల సంఖ్య ఏడాదికేడాది వేగంగా పెరుగుతోంది. ట్రాఫిక్ జామ్‌లు, నో-పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపివేయడం, రోడ్డు పక్కన అనియంత్రిత పార్కింగ్ నగరానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రధాన రహదారులు, జంక్షన్లు, వాణిజ్య ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్ వల్ల ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితులు నగరంలో నిత్యకృత్యంగా మారాయి. వాహనాలు అకస్మాత్తుగా చెడిపోవడం కూడా ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఈ పరిస్థితిని నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీసులకు కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

Bengaluru parking rules Bangalore parking rules Bengaluru towing system vehicle towing Bengaluru illegal parking Bangalore traffic congestion Bengaluru BBMP parking rules Bangalore traffic police action new parking rules Bengaluru wrong parking fines Bangalore urban traffic management India Bengaluru traffic chaos

Bengaluru ట్రాఫిక్ సమస్య ఇప్పుడు కేవలం అక్కడి సమస్య మాత్రమే కాదు. నెదర్లాండ్స్‌కు చెందిన టామ్‌టామ్ సంస్థ విడుదల చేసిన 2025 ట్రాఫిక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. 2024లో 72.7 శాతంగా ఉన్న సగటు ట్రాఫిక్ రద్దీ, 2025లో 74.4 శాతానికి పెరిగింది. ఒక్క సంవత్సరంలోనే 1.7 శాతం పెరుగుదల నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురి చేసింది.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. GBA ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన టోయింగ్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. నో-పార్కింగ్ జోన్లలో నిలిపిన వాహనాలు, అధిక ట్రాఫిక్ ప్రాంతాల్లో చెడిపోయి రోడ్డుపై అడ్డుగా నిలిచే వాహనాలను వెంటనే తొలగించేందుకు టోయింగ్ వ్యవస్థ కీలకమని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో ఐదు నగర కార్పొరేషన్ జోన్లకు రెండు చొప్పున టోయింగ్ వాహనాలను కొనుగోలు చేసి సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు అందించనున్నారు.

ఈ వాహనాలను త్వరగా కొనుగోలు చేయాలని GBA చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టోయింగ్ వాహనాల పార్కింగ్ కోసం ప్రతి జోన్‌లో ప్రత్యేక ప్రదేశాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు. టోయింగ్‌తో పాటు రెండు అంచెల పార్కింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. వెడల్పాటి రోడ్లపై ఆన్-స్ట్రీట్ చెల్లింపు పార్కింగ్, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఖాళీ స్థలాల్లో ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.

నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్‌కు అనుమతి ఉంటుంది. గంటకు బైక్‌లకు రూ.15, కార్లకు రూ.30 వసూలు చేస్తారు. పూర్తి రోజుకు బైక్‌లకు రూ. 75, కార్లకు రూ. 150గా నిర్ణయించారు. నెలవారీ పాస్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. మొత్తం 35 రోడ్లను గుర్తించి టెండర్లు పిలిచారు. కమర్షియల్ స్ట్రీట్, చర్చ్ స్ట్రీట్, మాగ్రాత్ రోడ్, సంపిగే రోడ్, బ్రిగేడ్ రోడ్, 80 ఫీట్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.

మల్లేశ్వరం సంపిగే రోడ్డులో పార్కింగ్ అమలు ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో కీలకమని అధికారులు చెబుతున్నారు. హెబ్బాల్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ కోసం స్థలాన్ని గుర్తించారు. ఈ వ్యవస్థ ఫిబ్రవరి రెండో వారం నుంచి దశలవారీగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏదేమైనా టోయింగ్ వ్యవస్థ పునరుద్ధరణ, చెల్లింపు పార్కింగ్ అమలు ద్వారా బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు కొంతమేరైనా ఊరట కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+