బెంగళూరు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో టూ వీలర్స్‌కు నో ఎంట్రీ.. వెళితే బుక్కయినట్లే..

ఐటీ రాజధాని బెంగళూరులో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను నివారించడం, రోడ్డు ప్రమాద తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా Bengaluru ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్‌లు, ఎలివేటెడ్ కారిడార్లపై శుక్రవారం ఉదయం నుంచే కఠిన వాహన ఆంక్షలను అమలుల్లోకి తెచ్చారు. సీసీటీవీ నిఘా కెమెరాల ద్వారా ఈ నిబంధనల ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

వివిధ కారిడార్లలో అమలవుతున్న ఆంక్షల వివరాలు:
అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డు కారిడార్: ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై ద్విచక్ర (టూ వీలర్) వాహనాల రాకపోకలను శుక్రవారం ఉదయం నుండి పూర్తిగా నిషేధించారు. అంతర్జాతీయ విమానాశ్రయ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌పై ద్విచక్ర వాహనాల నిషేధంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో, నిర్ణీత వేగ పరిమితి (Speed Limits) లోబడి ప్రయాణించే టూవీలర్లకు ఉదయం, సాయంత్రం వేళల్లో తాత్కాలిక సడలింపులపై ట్రాఫిక్ పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు.

Bengaluru traffic Bengaluru traffic restrictions Bengaluru traffic rules Airport Road Bengaluru Bengaluru Airport Road elevated corridor Bengaluru two-wheeler ban Bengaluru bike ban Airport Road vehicle restrictions Bengaluru Bengaluru traffic update Bengaluru traffic diversion airport traffic Bengaluru Bengaluru road restrictions traffic curbs Bengaluru Bengaluru traffic news

ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్: ఈ ఫ్లైఓవర్‌పై వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 11) నుండి ద్విచక్ర వాహనాలపై నిషేధం అమల్లోకి రానుంది.వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 11) నుంచి అమల్లోకి రానున్న టూవీలర్ల నిషేధానికి సంబంధించి బోర్డులు, డెలివరీ పాయింట్ల వద్ద ప్రత్యేక హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేస్తున్నారు.
బీజీఎస్ ఫ్లైఓవర్ (పశ్చిమ బెంగళూరు): ఉదయం, సాయంత్రం రద్దీ (పీక్) సమయాల్లో త్రిచక్ర వాహనాలు సహా అన్ని సరుకు రవాణా వాహనాలపై నిషేధం విధించారు. అలాగే భారీ సరుకు రవాణా వాహనాలను రోజంతా అనుమతించరు.
పీణ్య ఎలివేటెడ్ కారిడార్: ఈ మార్గంలో ఆటోరిక్షాలను రోజంతా నిషేధించగా, రద్దీ సమయాల్లో సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధించారు.
ఇతర కారిడార్లు: సిల్క్ బోర్డ్-రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, ఇతర నిర్దేశిత మార్గాల్లోనూ పలు వాహన వర్గాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై నిబంధనలు పాటించని త్రిచక్ర వాహనాలు, సరుకు రవాణా వాహనాలపై శుక్రవారం నుంచే పాయింట్-టు-పాయింట్ సీసీటీవీ చలాన్ల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు.

Also Read

రోడ్డు రూపకల్పన, ఫ్లైఓవర్‌ల వెడల్పు, ప్రమాదాల తీవ్రతను తగ్గించడం, వాహనాలు పాడైపోవడం వల్ల ఏర్పడే ట్రాఫిక్ స్తంభనను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కార్తీక్ రెడ్డి తెలిపారు.రోడ్డు రద్దీని తగ్గించేందుకు మరియు ఫ్లైఓవర్లపై వాహనాలు పాడైపోవడం (Breakdowns) వల్ల గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ సర్వీసు రోడ్లను వినియోగించుకోవాలని జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) కోరారు. ఆంక్షలపై సవరణలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను వచ్చే వారంలో ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు, తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ మేకెదాటు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి ఎన్. చెలువరాయస్వామి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు పురోగతిపై వికాస్ సౌధలో నిర్వహించిన సమావేశంలో అధికారులను, అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టు వల్ల మునిగిపోయే అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన భూమిని త్వరగా గుర్తించి నష్టపరిహార నివేదికను ఆలస్యం లేకుండా సమర్పించాలని సూచించారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+