బెంగళూరు వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ ఏరియాలో ట్రాఫిక్‌కు చెక్.. నాలుగు లేన్ల అండర్‌పాస్ రెడీ..

Bengaluru Traffic Update: భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది. విండ్ టన్నెల్ రోడ్డు, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (NAL), చల్లాఘట్ట జంక్షన్ వద్ద ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన 300 మీటర్ల నాలుగు లేన్ల అండర్‌పాస్ నిర్మాణ పనులు ఇప్పుడు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ప్రీకాస్ట్ నిర్మాణాలను అమర్చేందుకు భారీ ఎర్త్ మూవర్లు స్థలాన్ని సిద్ధం చేస్తుండగా.. సుమారు రూ. 19.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ జనవరి 2027 నాటికి పూర్తిస్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు వెల్లడించారు.

ప్రస్తుతం హెచ్‌పీ పెట్రోల్ బంక్ వైపున మిగిలి ఉన్న రిటైనింగ్ వాల్ (నిలుపుగోడ) నిర్మాణం పూర్తి కాగా.. మట్టి తవ్వకం, భూగర్భ పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు జనవరి వరకు గడువు విధించారు. అయితే నిర్మాణ స్థలంలో 300 మిల్లీమీటర్ల వ్యాసం గల బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) నీటి పైప్‌లైన్ ఉండటంతో ఇంజనీరింగ్ బృందాలకు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి.

Bengaluru Old Airport Road underpass four lane underpass Bengaluru Bengaluru traffic update Old Airport Road traffic Bengaluru infrastructure projects underpass opening January 2027 2027

ఈ పైప్‌లైన్‌తో పాటు ఇతర భూగర్భ యుటిలిటీలను సురక్షితంగా తరలించేందుకు BWSSB ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటూ పనులు కొనసాగిస్తున్నారు. వచ్చే వారం నాటికి అండర్‌పాస్ ఒక వైపు ప్రీకాస్ట్ బాక్సుల ఏర్పాటు ప్రారంభమవుతుందని.. డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తయి ఒక వైపు ట్రాఫిక్‌ను అనుమతిస్తామని.. అనంతరం జనవరిలో రెండో వైపు బాక్సుల నిర్మాణం పూర్తయి ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగుతాయని సైట్ ఇంజనీర్లు వివరించారు.

Also Read

నిజానికి ఈ అండర్‌పాస్ నిర్మాణం 2023లోనే పూర్వపు బృహత్ బెంగళూరు మహానగర పాలిక ప్రాజెక్ట్ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చార్టర్డ్ విమానాలలో ప్రయాణించే వీవీఐపీల రాకపోకలు హెచ్‌ఏఎల్ (HAL) పాత విమానాశ్రయం మీదుగా నిరంతరం సాగుతుండటంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో అనుమతి నిరాకరించారు. గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు లోక్‌భవన్‌కు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే కేంద్ర మంత్రులు ఇదే మార్గంలో ప్రయాణిస్తుండటం అప్పట్లో ప్రధాన అడ్డంకిగా మారింది.

ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో పట్టణాభివృద్ధి శాఖ జోక్యంతో ట్రాఫిక్ విభాగం అనుమతి ఇవ్వడంతో చీఫ్ కమిషనర్ ఎం. మహేశ్వరరావు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డును పాక్షికంగా మాత్రమే తవ్వుతూ పనులు చేపట్టాలనే నిబంధనను పాటిస్తూనే ఇప్పటివరకు 75 నుండి 80 శాతం పనులను పూర్తి చేసినట్లు బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ ఇంజనీర్ పేర్కొన్నారు.

మే నెలలో పనులను తనిఖీ చేసిన మహేశ్వరరావు, అత్యాధునిక సాంకేతికతతో మూడు నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ భూగర్భ యుటిలిటీల తరలింపు వల్ల కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం అదనపు యంత్రసామగ్రిని మోహరించి మూడు షిఫ్టులలో పనులు నిర్వహిస్తుండటంతో.. జనవరి 2027 నాటికి ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు జంక్షన్ వద్ద దశాబ్దాల నాటి ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+