బెంగళూరు నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోని సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి కేఆర్ పురం మెట్రో స్టేషన్ వరకు ఉన్న సుమారు 17 కిలోమీటర్ల విభాగాన్ని సమగ్రంగా పునఃరూపకల్పన చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.307 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రయాణికులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.
డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (B-SMILE) అమలు చేయనుంది. Bengaluru నగరంలోని ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన ఈ మార్గాన్ని ప్రతిరోజూ లక్షలాది ఉద్యోగులు, నివాసితులు కీలక రహదారిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలు కదలలేని స్థాయికి చేరి, డ్రైవర్లు గంటల తరబడి రోడ్డు మీద ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.

ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళికల ప్రకారం.. ఈ ORR విభాగాన్ని మొత్తం 10 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో మూడు ప్రధాన క్యారేజ్‌వే లేన్‌లు ఉండగా, ప్రతి వైపున రెండు సర్వీస్ రోడ్డు లేన్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ప్రధాన రహదారిపై భారాన్ని తగ్గించి.. స్థానిక రాకపోకలకు సర్వీస్ రోడ్లు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో మరో కీలక అంశం ఏంటంటే.. ప్రస్తుతం పనిచేయని బస్సు ప్రాధాన్యతా లేన్‌ను తిరిగి ప్రారంభించడమే. ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించవచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి బస్సు ప్రాధాన్యతా లేన్ పునరుద్ధరణ చాలా కీలకమని B-SMILEకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ చర్యతో బస్సుల ప్రయాణ వేగం పెరిగి.. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు ఆకర్షితులవుతారని అంచనా.
వాహనాలకే కాకుండా..పాదచారులు, సైక్లిస్టులకు కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ORR రెండువైపులా నిరంతర బ్రష్డ్-కాంక్రీట్ ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవే ఫుట్‌పాత్‌లు అంకితమైన సైకిల్ లేన్‌లుగా కూడా ఉపయోగపడతాయి. దీంతో సురక్షితంగా నడిచే వారికి, సైకిల్‌పై ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
రహదారిలోని కొన్ని పాత, దెబ్బతిన్న విభాగాలను పూర్తిగా పునర్నిర్మించనుండగా.. మిగతా భాగాలపై కొత్త బిటుమినస్ కాంక్రీటు పొర వేయనున్నారు. అదనంగా, ప్రయాణికుల సమాచార ప్యానెల్‌లతో కూడిన ఆధునిక బస్ షెల్టర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి బస్సు రాకపోకల సమాచారాన్ని ప్రత్యక్షంగా చూపించడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది. ఇబ్లూర్ నుంచి కేఆర్ పురం వరకు ఉన్న మెట్రో లైన్ కింద స్కైవాక్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత రూ.307 కోట్ల నిధుల్లో ఇది భాగం కాదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్‌కు మొదట అంచనా వేసిన వ్యయం దాదాపు రూ.400 కోట్లు కాగా, క్యాబినెట్ ఆమోదించిన బడ్జెట్ దానికంటే తక్కువగా ఉండటం. ఇది ప్రస్తుతం అత్యవసరమైన పనులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమలు చేసే సూచనగా భావిస్తున్నారు.సిల్క్ బోర్డ్-కేఆర్ పురం ORR విభాగం బెంగళూరులోని అత్యంత సమస్యాత్మక రహదారి మార్గాల్లో ఒకటి. ఐటీ ఉద్యోగులు, స్థానిక నివాసితులకు ఈ రోడ్డు మీద ప్రయాణం నరకం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర పునరుద్ధరణ ప్రాజెక్ట్ బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం దిశగా ఒక కీలక అడుగుగా పౌరులు ఆశిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications