బెంగళూరు నగరంలో త్వరలో రెడ్ మెట్రో లైన్ ఏర్పాటు కానుంది. ఈ లైన్ దాదాపు 30 స్టేషన్లను కలిగి ఉంటుంది. సర్జాపూర్ నుండి ప్రారంభమై నగర కేంద్రం కోరమంగళ మీదుగా హెబ్బాల్ వరకు వెళ్తుంది. ఈ Red Line బెంగళూరు మెట్రో ప్రాజెక్టులలో అతి పొడవైనది. ఎందుకంటే ఇది రద్దీగా ఉండే ఆగ్నేయ, కోరమంగళ వ్యాపార ప్రాంతంతో పాటుగా మధ్య బెంగళూరును నేరుగా కలుపుతుంది. ఈ మార్గంలో సర్జాపూర్, సోమపుర, దొడ్డసంద్ర, ముత్తనల్లూరు, కోదాటి గేట్, సోలికుంటె, కార్మెలారం, కైకొండరహళ్లి, బెల్లందూరు, అగర్, ఇబలూరు, కోరమంగళ 2వ, 3వ బ్లాక్‌లు, జక్కసంద్ర, టౌన్‌హాల్, కె.ఆర్. సర్కిల్, ప్యాలెస్ గుట్టహళ్లి, మేఖ్రీ సర్కిల్ మరియు గంగా నగర్. సర్జాపూర్, సోమాపురం, దొడ్డసంద్ర, కోదాటి గేట్ వంటి ప్రాంతాలకు నేరుగా మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
కాగా BMRCL ఈ మార్గాన్ని నాలుగు విభాగాలుగా రూపొందించింది. సర్జాపూర్-కర్మేలారం ఎలివేటెడ్ మార్గంగా ఉంది. ఇది 9.8 కి.మీ వరకు ఉంటుంది. ఇక కార్మెలారం-కోరమంగళ 3వ బ్లాక్ ఎలివేటెడ్ మార్గం 9.2 కి.మీ ఉంటుంది. కోరమంగళ 2వ బ్లాక్-కె.ఆర్. సర్కిల్ భూగర్భంలో 7.6 కి.మీ వరకు రానుంది. ఇక కె.ఆర్. సర్కిల్-హెబ్బల్ గుండా మిశ్రమ మార్గం 8.8 కి.మీ వరకు ఉంటుంది. ఈ మార్గం ఐటీ జోన్లు, నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, మార్కెట్లు, మాల్స్‌ను కలుపుకుంటూ వెళుతుంది. సర్జాపూర్-కోరమంగళ-సెంట్రల్ నుండి ప్రస్తుతం 40 నిమిషాల నుండి 2 గంటల సమయం పట్టే రోజువారీ ప్రయాణం మెట్రో ద్వారా 15-20 నిమిషాల్లో పూర్తవుతుంది.

హెబ్బల్‌కు కొత్త డైరెక్ట్ లింక్ దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల ప్రజలు రద్దీ లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఈ మార్గం సర్జాపూర్ ఐటీ బెల్ట్, కోరమంగళ వాణిజ్య జోన్, టౌన్‌హాల్-కె.ఆర్. సర్కిల్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నేరుగా కలుపుతుంది. ఈ రెడ్ లైన్ పూర్తయిన తర్వాత, పెద్ద సంఖ్యలో రోజువారీ ప్రయాణీకులను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, నగర ట్రాఫిక్‌పై ఒత్తిడి తగ్గుతుందని BMRCL ఒక ప్రకటనలో తెలిపింది. వేగవంతమైన, నమ్మదగిన మెట్రో సేవతో, బెంగళూరు పౌరులు తమ రోజువారీ ప్రయాణాన్ని సులభతరంగా, సురక్షితంగా చేసుకోగలుగుతారని తెలిపింది.
ఏదేమైనా బెంగళూరులో రూపుదిద్దుకుంటున్న తదుపరి అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్.. హెబ్బాల్ నుండి సర్జాపూర్ వరకు వెళ్లే రెడ్ లైన్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను కలిపే లక్ష్యంతో సిద్ధమవుతోంది. ట్రాఫిక్ భారం ఎక్కువగా ఉండే, ప్రయాణ అవసరం ఎక్కువగా ఉన్న, రోజూ వేలాది వాహనాలు కిక్కిరిసే ప్రధాన కారిడార్‌లను ఈ లైన్ ఒక్కటే సమర్థంగా అనుసంధానించనుంది. ఆగ్నేయ, మధ్య బెంగళూరు మధ్య ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, నివాసితులు వంటి లక్షలాది మంది ఈ లైన్ ప్రారంభమైతే తమ రోజువారీ ప్రయాణాల్లో భారీ సౌలభ్యాన్ని పొందబోతున్నారు.
మొత్తం 36.59 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రెడ్ లైన్, ఇప్పటి వరకు బస్సులు, ప్రైవేట్ వాహనాలపై మాత్రమే ఆధారపడుతున్న అనేక ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేయడానికి రూపుదిద్దుకుంది. పెద్ద పెద్ద నివాస కాలనీలు, ప్రముఖ ఐటీ పార్కులు, మార్కెట్ స్ట్రీట్‌లు, హాస్పిటల్ జోన్‌లు, విద్యా సంస్థలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్ళు.. ఇవన్నీ ఒకే మెట్రో కారిడార్ కిందకు వస్తాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి వస్తే, నగర అభివృద్ధి, ప్రయాణ సదుపాయాల పరంగా ఇది బెంగళూరుకు గేమ్-చేంజర్‌గా నిలుస్తుంది. 2031 నాటికి ఈ రెడ్ లైన్‌ను పూర్తిగా ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలని BMRCL లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సమయానికి అమలవుతే, బెంగళూరులో ఈస్ట్-వెస్ట్, నార్త్-సౌత్ కనెక్టివిటీనే కాదు, మొత్తం నగర ప్రయాణ వ్యవస్థను పూర్తిగా మార్చే కీలక అప్‌గ్రేడ్‌గా మారే అవకాశం ఉంది.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications