ఒకప్పుడు "గార్డెన్ సిటీ"గా, "పెన్షనర్ల స్వర్గం"గా పిలవబడిన బెంగళూరు (Bengaluru), నేడు భారతదేశానికి టెక్నాలజీ హబ్ గా మారింది. కానీ, ఇప్పుడు ఆ హబ్.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేల కోట్ల పెట్టుబడులకు, లక్షలాది ఉద్యోగుల ఆశలకు నిలయమైన ఈ నగరం.. ట్రాఫిక్, గుంతలు, నీటి కొరత అనే మూడు మహా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిగురించి స్టార్టప్ ల సీఈవోలు, ఎంట్రప్రెన్యూర్లు ఆవేదన చెందుతున్నారు.

ఆగిపోయిన జీవితం.. అంతం లేని ట్రాఫిక్!
ప్రపంచంలోని నెమ్మదిగా కదిలే ట్రాఫిక్ జామ్‌లో బెంగళూరు ట్రాఫిక్(Bengaluru traffic) మూడో ప్లేస్ లో ఉంది. ఉదయం పూట ఆఫీస్‌కు వెళ్లడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఉద్యోగుల దినచర్య పూర్తిగా దెబ్బతింటోంది అని ప్రముఖ స్టార్టప్ కో ఫౌండర్ ఆర్కే మిశ్రా అంటున్నారు. "పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పీక్ అవర్స్‌లో 16 కి.మీ ప్రయాణానికే రెండు గంటలు పడుతోంది. ఇకపై ఇక్కడ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేదు. ప్రజలు పని తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. మీ రోజును ప్లాన్ చేసుకోలేకపోవడం నిజంగా బాధాకరం." అని ఆయన అన్నారు. మిశ్రా వంటి పారిశ్రామికవేత్తలు మధ్యాహ్నం వరకు ఇన్-పర్సన్ మీటింగ్స్ పెట్టుకోవడాన్ని మానేశారంటే, బెంగళూరు ట్రాఫిక్ ఇబ్బంది ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుంతల దారిలో గ్లోబల్ టెక్ కంపెనీలు
అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాలు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో ఇవి నీటితో నిండిపోతాయి, సాధారణ రోజుల్లో గుంతలు, ధూళితో నిండి ఉంటాయి. ట్రక్కింగ్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ BlackBuck CEO రాజేష్ యాబాజీ విసుగు చెంది, తమ కంపెనీని ORR నుంచి తరలిస్తున్నట్లు ప్రకటించారు. "నా కొలీగ్స్ కు సగటు వన్ వే ట్రావెల్ టైం1.5 గంటలకు పైగా పెరిగింది. రోడ్లు గుంతలు, ధూళితో నిండి ఉన్నాయి." అని ఆయన అంటున్నారు. ఫార్మా దిగ్గజం బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా కూడా గతంలోరోడ్లపై వ్యాఖ్యలు చేశారు.
తక్షణ పరిష్కారమే మార్గం
బెంగళూరులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదు. దీని ఫలితంగా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. "శీతోష్ణస్థితి మార్పుల కారణంగా వరదలు, కరువులు ఒకేసారి వస్తున్నాయి. ప్రజలు కాలుష్యం, కాంక్రీటు, దుమ్ము, ట్రాఫిక్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు." అని ఎకాలజిస్ట్ హరిణి నాగేంద్ర అన్నారు. "నగర మౌలిక సదుపాయాలు మూడు నుండి ఐదు సంవత్సరాలు వెనుకబడి ఉన్నాయి." ఇన్ఫోసిస్ మాజీ CFO టీవీ మోహన్‌దాస్ పాయ్ అంటున్నారు. ఇక మరికొందర సమయం మించిపోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సంస్థ బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ బిఎస్ ప్రహల్లాద్.. "ఏదైనా చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. ఇక బెంగళూరు సిటీ క్షీణించమే చివరి దశ" అని అన్నారు.
రెస్పాన్స్ ఇలా..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిపై స్పందిస్తూ.. 10,000 పైగా గుంతలను గుర్తించి, మరమ్మతులు చేస్తున్నట్లు ప్రకటించారు. "ప్రపంచం భారతదేశాన్ని బెంగళూరు ద్వారా చూస్తుంది, మనం కలిసి నగరాన్ని నిర్మించుకోవాలి!" అని పిలుపునిచ్చారు. ఇక ఈ చర్చ గురించి మొహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ "భారతదేశానికి పేదరికాన్ని ఎలా నిర్వహించాలో తెలుసు, కానీ, శ్రేయస్సును ఎలా నిర్వహించాలో తెలియదు కాబట్టి, మనం అభివృద్ధి బాధలను అనుభవిస్తున్నాము. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, కానీ కొంచెం కష్టం ఉంటుంది." అని ముగించారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications