బెంగళూరులో ట్రాఫిక్ అనేది కొత్త విషయం కాదు. కానీ ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో మళ్లీ ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. "నా ఫ్రెండ్‌కి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ ఇచ్చాను... ఆమె దుబాయ్‌కి చేరిపోయింది... కానీ నేను ఇంకా ట్రాఫిక్‌లోనే ఉన్నాను!" అనే కథనం ఎంతో మంది హృదయాలను తాకింది.

ఈ వీడియోను ఫుడ్, ట్రావెల్ వ్లాగర్లు ప్రియాంకా మరియు ఇంద్రయాణి తమ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. దానికి జత చేసిన టెక్స్ట్ "True Incidents - Tag Bangalore People" అనే క్యాప్షన్ వైరల్ అయింది. ఈ వీడియోలో చూపించిన అనుభవం చాలా మందికి నిజంగా ఎదురైన అనుభవమేనంటూ కామెంట్ల వర్షం కురిసింది.
బెంగళూరు వాసులు తమ సొంత అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటూ ఈ పరిస్థితి ఎంత చింతించదగ్గదో, అలాగే ఎంత హాస్యాస్పదంగానూ ఉందో వెల్లడించారు.
ఒక యూజర్ "ఇది నాకు కూడా జరిగింది. నా పేరెంట్స్ నన్ను ఎయిర్‌పోర్ట్‌కి పంపారు. నేను ఢిల్లీకి చేరే సమయానికి వాళ్లు ఇంటికి వచ్చేశారు!" ఇంకో వ్యక్తి మాట్లాడుతూ "నా సిస్టర్ మంగళూరుకి వెళ్తూ లాస్ట్ మినిట్‌లో బోర్డ్ అయింది. కానీ ఆమె అక్కడికి చేరేసరికి నేను ఇంకా బెంగళూరు ట్రాఫిక్‌లోనే ఇంటికి వెళ్లే దారిలోనే ఉన్నాను!"
ఇంకో కామెంటర్ హాస్యంగా స్పందిస్తూ "నిజంగా చెప్పాలంటే, నేను ఒక స్టేట్ నుంచి రెండు గంటల ఫ్లైట్‌లో వచ్చాను. కానీ బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి ఐదు గంటలు పట్టింది. ఇది ట్రావెల్ కాదు ట్రామా!" మరొకరైన "ఈ స్థితిలో నడవడం చాలా బెటర్!" అని జోక్ చేశారు.
ఇంకొకరూ ఇలా స్పందిస్తూ "బెంగళూరులో కారులో 1 కిలోమీటరు = 3 గంటలు, నడిచే దూరం అదే అయితే = 10 నిమిషాలు అని చెప్పుకొచ్చారు.
ఈ సంధర్భంగా, బెంగుళూరు ట్రాఫిక్ పరిస్థితిపై తీవ్ర చర్చ తెరపైకి వచ్చింది. 2025 మొదటి అరవ సంవత్సరంలో 3 లక్షలకుపైగా కొత్త వాహనాల నమోదైంది. మొత్తం నగర వ్యాప్తంగా 1కోటి 10లక్షల పైగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయని రిపోర్టులు చెబుతున్నాయి. కొన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ 45% వరకు పెరిగింది, మరియు రష్ అవర్‌లో వాహనాల వేగం 15 కిమీ/గం కన్నా తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
వాహనాల పెరుగుదల, బైక్‌టాక్సీలపై నిషేధం, మరియు ఆలస్యంగా నడుస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇవన్నీ కలిసిపోయి నగరాన్ని నిజంగా సందర్భం లేని స్టాండ్‌స్టిల్‌కి తీసుకుపోతున్నాయి.
ఈ పోస్టుతో, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. భారత్‌లోని టెక్నాలజీ రాజధానిగా పేరు పొందిన ఈ నగరంలో రోజూ లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ట్రాఫిక్ విషయంలో పట్టణ ప్రణాళికల లోపాలు ఇప్పుడు ప్రజల మానసిక స్థితిని పరీక్షిస్తున్నాయి.


Click it and Unblock the Notifications