ఆగస్టు 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగళూరుకు వస్తున్నారు.బెంగళూరు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో ఎల్లో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సమయంలో బెంగళూరు వాసులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రేపు నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) అనేక రోడ్లపై వాహనాల రాకపోకలు, పార్కింగ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోడీ ఉదయం 10.30 గంటలకు HAL విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్, రోడ్డు మార్గంలో KSR బెంగళూరు (నగరం) రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయన మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. KSR బెంగళూరు-బెల్గాం, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రి, అజ్ని (నాగ్‌పూర్)-పుణే మార్గాలను ఆయన ప్రారంభిస్తారు.

రైల్వే స్టేషన్ కార్యక్రమం అనంతరం మోడీ రోడ్డు మార్గంలో రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. ఉదయం 11.45 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు రాగిగుడ్డ నుండి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు. ఎల్లో లైన్‌లో ఇది మొదటి అధికారిక ప్రయాణం అవుతుంది.మధ్యాహ్నం 12.50 గంటలకు ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో స్టేషన్ చేరుకున్న తర్వాత, రోడ్డు మార్గంలో ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)కి చేరుకుంటారు. IIITB ఆడిటోరియంలో, మోడీ ఎల్లో లైన్‌ను ప్రారంభించి, మెట్రో ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో HAL విమానాశ్రయానికి చేరుకుని, మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీకి వెళతారు.
ప్రధాని మోదీ ప్రారంభించే మూడు వందే భారత్ రైళ్ల వివరాలు
KSR బెంగళూరు - బెళగావి వందే భారత్
అమృత్‌సర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్
అజ్ని (నాగ్‌పూర్) - పుణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ట్రాఫిక్ ఆంక్షలు & రోడ్డు మూసివేతలు:
ఉదయం 8:30 - మధ్యాహ్నం 12:00 : రాజలక్ష్మి జంక్షన్ నుండి మారేనహళ్లి 18వ మెయిన్ రోడ్డు వరకు, అలాగే మారేనహళ్లి ఈస్ట్ ఎండ్ మెయిన్ రోడ్ జంక్షన్ నుండి అరవింద్ జంక్షన్ వరకు వాహన రాకపోకలు పరిమితం.
ఉదయం 9:30 - మధ్యాహ్నం 2:30: సిల్క్ బోర్డ్ నుండి హోసూర్ వరకు ఉన్న ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు హోసూర్ రోడ్ మూసివేత. హోసూర్ నుండి నగరానికి వచ్చే వాహనాలపైనా ప్రభావం.
ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1: ఇన్ఫోసిస్ అవెన్యూ, వేలంకని రోడ్, HP అవెన్యూ రోడ్ మూసివేత.
పార్కింగ్ నిషేధం: మారేనహళ్లి మెయిన్ రోడ్, 4వ మెయిన్ రోడ్, 18వ మెయిన్ రోడ్‌లో రోజంతా అమలు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు:
రాజలక్ష్మి జంక్షన్ - జయదేవ హాస్పిటల్: సారక్కి మార్కెట్ రోడ్ → IG సర్కిల్ → RV డెంటల్ జంక్షన్ → 8వ మెయిన్-9వ క్రాస్.
బన్నేరుఘట్ట రోడ్ - 4వ మెయిన్ రోడ్ : సారక్కి మెయిన్ రోడ్ → IG సర్కిల్ → RV డెంటల్ జంక్షన్.
ఈస్ట్ ఎండ్ సర్కిల్ - బనశంకరి : 29వ మెయిన్ → 28వ మెయిన్ → డెల్మియా జంక్షన్ → ఔటర్ రింగ్ రోడ్ → సారక్కి జంక్షన్.
HSR లేఅవుట్, కోరమంగళ, బెల్లందూర్, వైట్‌ఫీల్డ్ - హోసూర్** : సర్జాపూర్ రోడ్ → చందపుర.
ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ 1 లోపల : 2వ క్రాస్ రోడ్, శికారిపాల్య రోడ్, హులిమంగళ రోడ్, గొల్లహల్లి రోడ్.
NICE రోడ్ - హోసూర్ : బన్నెరఘట్ట జంక్షన్ → జిగని రోడ్ → హోసూర్ రోడ్.
హోసూర్ రోడ్ - కనకపుర/మైసూరు/తుమకూరు : బొమ్మసంద్ర జంక్షన్ → జిగని రోడ్ → NICE రోడ్.
ప్రయాణికులకు పోలీసుల సూచనలు:
వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించండి.
ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోండి.
ఆంక్షల సమయంలో సూచించిన రహదారులను తప్పించండి.
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications