బెంగళూరు మారతహళ్ళి మీదుగా ప్రయాణం చేసే వారికి బిగ్ ట్రాఫిక్ అలర్ట్.. కొత్త రూట్ మ్యాప్ తీసుకువచ్చిన పోలీసులు

బెంగళూరు నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు కీలకమైన మారతహళ్లి ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మారతహళ్లి వంతెన చుట్టుపక్కల ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక రహదారి మార్పులను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త నియమాలు డిసెంబర్ 22 నుంచి అమలు కానున్నాయి.

ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న ఈ చర్యలపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) ద్వారా వివరాలు వెల్లడించారు. మార్గ మార్పులతో పాటు, వాహనదారులు సులభంగా అర్థం చేసుకునేలా వీడియో మ్యాప్‌ను కూడా పోస్టు చేశారు. ఈ మార్పులు ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.ట్రాఫిక్ పోలీసులు తెలిపిన ప్రకటన ప్రకారం.. డిసెంబర్ 22 నుంచి దేవరబీసనహళ్లి, కడుబీసనహళ్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు KL సర్వీస్ రోడ్ ద్వారా వర్తూర్ లేదా వైట్‌ఫీల్డ్ వైపు కుడివైపు మలుపు తిరిగే అవకాశం ఉండదు. ఈ నిబంధనతో మారతహళ్లి వంతెన వద్ద ఏర్పడే బాటిల్‌నెక్ పరిస్థితిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Bengaluru traffic alert Bengaluru traffic update Bengaluru road diversions temporary route changes Bengaluru Bengaluru congestion news Bengaluru traffic police advisory new traffic routes Bengaluru Bengaluru traffic map Bengaluru traffic video road closures Bengaluru today Bengaluru commute update traffic diversion map Bengaluru Bengaluru peak hour traffic Bengaluru city traffic news Bengaluru route changes today

అదేవిధంగా..తులసి థియేటర్ జంక్షన్ వద్ద ఉన్న మీడియన్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. Bengaluru మారతహళ్లి వైపు నుంచి వచ్చే వాహనాలు దొడ్డనెకుండి జంక్షన్ వద్ద యు-టర్న్ తీసుకోవడం కూడా నిషేధించడం జరిగింది. ఈ మార్పులు అమలులో ఉన్న సమయంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

వర్తూర్ లేదా కుందహళ్లి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్‌లో కార్తీక్ నగర్ జంక్షన్ వద్ద యు-టర్న్ తీసుకొని.. కళామందిర్ సర్వీస్ రోడ్ ద్వారా వర్తూర్ మెయిన్ రోడ్‌కి చేరుకోవచ్చని తెలిపారు. అదే విధంగా.. కెఆర్ పురం వైపు ప్రయాణించే వారు దొడ్డనెకుండి మెయిన్ రోడ్ జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తీసుకుని కార్తీక్ నగర్ వైపు వెళ్లి, అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్‌లో చేరాలని సూచించారు.

ఈ మార్పులు పూర్తిగా తాత్కాలికమేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రయాణికుల సహకారం ఉంటే భవిష్యత్తులో శాశ్వత మార్పులు తీసుకురావడం సులభమవుతుందని తెలిపారు. మీ సహకారంతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది. మారతహళ్లిని ముందుకు నడిపిద్దాం అని వారు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 112కి కాల్ చేయాలని కూడా సూచించారు.

ఇక బెంగళూరులో నేడు మరో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కన్నడ సంఘాల మద్దతుతో విమానాశ్రయ టాక్సీ డ్రైవర్లు, విమానాశ్రయ ప్రాంగణంలో వాహనాల కదలికపై ఇటీవల అమలు చేసిన జరిమానా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన వల్ల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే, అక్కడి నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు ఆలస్యాలు, చివరి మైలు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది.ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+