బెంగళూరులో కొన్ని ప్రధాన రోడ్లపై నిర్మాణ పనులు, నవరాత్రి ఉత్సవాల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాబోయే కొన్ని రోజుల్లో ట్రాఫిక్ పరిస్థితులు అసౌకర్యకరంగా ఉండవచ్చని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) ప్రయాణికులకు సూచించారు. ప్రత్యేకంగా.. ప్యాలెస్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకలు దుర్గా పూజ కార్యక్రమాల కారణంగా.. ప్యాలెస్ పరిధిలోని బళ్లారి రోడ్డు సప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2 వరకు భారీగాట్రాఫిక్ జాములు వాహన రద్దీ సమస్యలకు లోనవుతుందని అధికారులు హెచ్చరించారు.
సర్జాపూర్ రోడ్డులో వైట్-టాపింగ్ పనులు సెప్టెంబర్ 30 నుండి ఆటోమార్ట్ జంక్షన్- అగర జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణం దాదాపు రెండు నెలల పాటు కొనసాగనుంది. ఒకవైపు రోడ్డును వన్-వేగా నడిపించడం వలన వాహనాలు, బస్సులు, ఆటోలు సజావుగా రాకపోకలు చేయలేవు. ఈ కారణంగా సర్జాపూర్ రోడ్డుపై ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలులో ఉన్నాయి.

ప్రయాణికులు వాహన రాకపోకలు, ట్రాఫిక్ జామ్, ఆలస్యం సమస్యలను తగ్గించుకోవడానికి ముందుగా ప్రణాళిక చేసుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం సిఫార్సు చేయడం జరిగింది. ప్రత్యేకంగా, Outer Ring Road నుండి కోర్మంగళ వైపు వెళ్ళే వాహనాలు అగర ఫ్లైఓవర్ ఎగువ ర్యాంప్‌ను ఉపయోగించి 19వ ప్రధాన రోడ్ లేదా 14వ ప్రధాన రోడ్ ఎగువ ర్యాంప్ వద్ద సర్వీస్ రోడ్‌కి చేరుకోవచ్చు. ఆటోమార్ట్ వైపు వెళ్ళే వారు 14వ మెయిన్ రోడ్ జంక్షన్ వరకు వెళ్లి, కుడివైపు మలుపు తీసుకుని ముందుకు సాగవచ్చు.
సజావుగా కదలికను కొనసాగించడానికి, ట్రాఫిక్ మార్షల్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రజలు ట్రాఫిక్ సిబ్బందికి సహకారించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని Bengaluru నగర పోలీసులు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం పండుగ వేడుకల సమయంలో జనసమూహం ఎక్కువగా ఉండటం వలన రోడ్లపై రద్దీ సమస్యలు మరింత తీవ్రమవుతాయని తెలిపారు.
క్లుప్తంగా చెప్పాలంటే బెంగళూరులో నవరాత్రి వేడుకలు, ప్యాలెస్ మైదానంలో దుర్గా పూజలు, సర్జాపూర్ రోడ్ నిర్మాణం.. ఈ రోడ్డులపై ప్రయాణం చేయడానికి సవాళ్లుగా మారాయి. ట్రాఫిక్ అధికారులు నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ.. ప్రయాణికులు ముందుగా ప్రణాళిక చేసుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం, సురక్షితంగా, సమయానికి ప్రయాణించడానికి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఈ రోడ్డుల మీద అవైడ్ చేయాలని తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications