బెంగళూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఐటి కంపెనీలు అలాగే విపరీతమైన ట్రాఫిక్. అయితే ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నా, వ్యాపారం, డబ్బు సంపాదనలో మాత్రం బెంగళూరుకు సాటిలేదని తేలిపోయింది. తాజాగా విడుదలైన 'హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025' ప్రకారం.. భారతదేశంలోనే అత్యధిక సంపద సృష్టించిన నగరంగా బెంగళూరు (Bengaluru) నిలిచింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. అత్యధిక బిలియన్ డాలర్ కంపెనీలకు నిలయంగా మారడమే కాకుండా, దేశంలోనే అత్యధిక మంది ఆంట్రప్రెన్యూర్లు ఉన్న నగరంగా బెంగళూరు రికార్డు సృష్టించింది.
ఎవరైతే ఒక కొత్త ఆలోచనతో రిస్క్ తీసుకుని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారో వారిని ఆంట్రప్రెన్యూర్(Entrepreneur) అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే 'వ్యాపారవేత్త' లేదా 'పారిశ్రామికవేత్త' అనుకోవచ్చు. ఉదాహరణకు మన దేశంలో జొమాటో, ఓలా లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలను సున్నా నుండి మొదలుపెట్టిన వారిని మనం ఆంట్రప్రెన్యూర్లుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆంట్రప్రెన్యూర్స్ విషయంలో బెంగళూరు (Bengaluru) ఇప్పుడు టాప్ లో ఉంది.

ముంబైని వెనక్కి నెట్టి..
ఇప్పటివరకు దేశ ఆర్థిక రాజధానిగా ముంబై పేరుగాంచింది. కానీ, కొత్త తరం వ్యాపారవేత్తల (సెల్ఫ్ మేడ్ ఆంట్రప్రెన్యూర్స్) విషయంలో బెంగళూరు ముంబైని రెండో స్థానానికి నెట్టేసింది.
- బెంగళూరు: 88 మంది అగ్రశ్రేణి ఆంట్రప్రెన్యూర్లతో మొదటి స్థానంలో ఉంది.
- ముంబై: 83 మందితో రెండో స్థానానికి పరిమితమైంది.
- ఢిల్లీ & గురుగ్రామ్: వరుసగా 52, 32 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- హైదరాబాద్: మన హైదరాబాద్ 12 మంది అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో 7వ స్థానంలో నిలిచింది.
నిబంధనలు ఇవే: వీరు మాత్రమే టాప్!
ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి హురూన్ ఇండియా కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. ఈ రిపోర్ట్ కోసం వారు కేవలం 'సెల్ఫ్ మేడ్' వ్యక్తులనే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ లిస్ట్ లో పరిగణలోకి తీసుకున్న కంపెనీలకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కంపెనీ 2000 సంవత్సరం తర్వాతే స్థాపించినదై ఉండాలి. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు లేదా విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు అయి ఉండకూడదు. అలాగే వారసత్వంగా వచ్చిన ఫ్యామిలీ బిజినెస్ కాకూడదు; సొంతంగా సున్నా నుండి మొదలుపెట్టిన వారై ఉండాలి.
రూ. 42 లక్షల కోట్ల మహా సామ్రాజ్యం!
భారతదేశంలోని టాప్ 200 ఆంట్రప్రెన్యూర్ల మొత్తం సంపద విలువ అక్షరాలా రూ. 42 లక్షల కోట్లు అని ఈ నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 51 నగరాల నుండి ఈ వ్యాపారవేత్తలు ఎంపికయ్యారు. అటు కంపెనీల పరంగా చూసినా బెంగళూరు 52 అత్యంత విలువైన కంపెనీలతో మొదటి స్థానంలో ఉంటే, ముంబై 51 కంపెనీలతో పోటాపోటీగా నిలిచింది.
నగరాల వారీగా టాప్ ఆంట్రప్రెన్యూర్ల సంఖ్య..
- బెంగళూరు: 88
- ముంబై: 83
- న్యూ ఢిల్లీ: 52
- గురుగ్రామ్: 32
- చెన్నై: 15
- హైదరాబాద్: 12
బెంగళూరు కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే కాదు, కొత్త ఐడియాలతో కోట్లు సంపాదించే స్టార్టప్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే బెంగళూరు (Bengaluru) ఆంట్రప్రెన్యూర్స్ ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే!
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications