Bengaluru: సైకిల్‌కు కూడా టోల్ కట్టాలా? బెంగళూరులో వింత ఘటన.. వీడియో వైరల్!

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద కార్లు, బైక్‌లు లేదా ఇతర మోటారు వాహనాలకు టోల్ వసూలు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఒక సైక్లిస్టును రూ. 25 టోల్ కట్టమని సిబ్బంది అడిగారనే వార్త ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Bengaluru toll plaza cyclist controversy rs 25 demand electronics city elevated corridor safety rules

అసలేం జరిగింది?

ఏప్రిల్ 18న ఒక యువకుడు తన సైకిల్‌పై సిల్క్ బోర్డ్ - ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ కారిడార్‌పై వెళ్తుండగా టోల్ ప్లాజా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఆ సమయంలో సిబ్బంది తనను రూ. 25 టోల్ కట్టమని అడిగారని ఆ సైక్లిస్ట్ ఆరోపించాడు. "నేను సైకిల్‌పై ఇండియా మొత్తం తిరిగాను, కానీ ఇలాంటి వింత అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు" అని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. టోల్ సిబ్బందితో వాదించిన ఆ యువకుడు, సైకిల్‌కు టోల్ కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.

అధికారుల వివరణ ఏంటి?

ఈ వివాదంపై ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా అధికారులు స్పందించారు. సైక్లిస్టు నుంచి ఎలాంటి టోల్ వసూలు చేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే, ఆ ఎలివేటెడ్ కారిడార్‌పై సైకిళ్లు వంటి నాన్-మోటరైజ్డ్ వాహనాలకు అనుమతి లేదని వారు వెల్లడించారు.

  • భద్రతా కారణాల దృష్ట్యా సైకిళ్లను ఆ హై-స్పీడ్ రోడ్డుపై అనుమతించరు.
  • ప్రవేశ మార్గాల వద్ద హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ, ఆ యువకుడు వాటిని పట్టించుకోకుండా వెళ్లాడని అధికారులు తెలిపారు.
  • నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిని కేవలం హెచ్చరించడానికి మాత్రమే ఆపినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు.

నెటిజన్ల చర్చ

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సైక్లిస్టుకు మద్దతుగా మాట్లాడుతుంటే, మరికొందరు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరమైన ఫ్లైఓవర్‌పై సైకిల్ తొక్కడం తప్పని విమర్శిస్తున్నారు. బెంగళూరు (Bengaluru) లో ట్రాఫిక్ నిబంధనల అమలు , టోల్ సిబ్బంది ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది.

ఈ ఘటన కేవలం ఒక టోల్ వివాదం మాత్రమే కాదు, నగరంలోని ట్రాఫిక్ భద్రతపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. హై-స్పీడ్ కారిడార్లలో సైకిళ్లను అనుమతించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, సైక్లిస్టులు కూడా నియమాలను పాటించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో, టోల్ సిబ్బంది అనధికారికంగా డబ్బులు డిమాండ్ చేయడం నిజమైతే అది తీవ్రమైన విషయమని పేర్కొంటున్నారు.

ఏదేమైన బెంగళూరు (Bengaluru) వంటి మెట్రో నగరాల్లో సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలంటే, వారికి సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివాదం పక్కన పెడితే, నిబంధనలపై అవగాహన పెంచుకోవడం వాహనదారులకు, సైక్లిస్టులకు ఇద్దరికీ శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+