Bengaluru: రూ. 50 వేల అద్దె కడుతున్నా వేస్టేనా? బెంగళూరు లగ్జరీ ఫ్లాట్ ఓనర్ ఆవేదన!
బెంగళూరులో ఐటీ ఉద్యోగులు పెరిగేకొద్దీ ఇళ్ల అద్దెలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్ లాంటి ఐటీ హబ్స్‌లో లగ్జరీ ఫ్లాట్ దొరకడమే గగనమైపోయింది. అయితే, ఇంత భారీగా డబ్బులు చెల్లించి లగ్జరీ సొసైటీల్లో ఉంటున్న వారికి నిజంగానే ఆ స్థాయి సౌకర్యాలు దక్కుతున్నాయా? అంటే కాదనే సమాధానం ఇస్తున్నాడు ఒక బెంగళూరు టెనెంట్.
వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ఒక వ్యక్తి, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడ్డిట్' (Reddit) లో పంచుకోవడంతో ఇప్పుడు ఐటీ సిటీలో పెద్ద చర్చ నడుస్తోంది. నెలకు ఏకంగా రూ. 50,000 రెంట్, మెయింటెనెన్స్ కడుతున్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం రూ. 20,000 నార్మల్ ఇల్లు లాగే ఉందంటూ అతను వాపోయాడు.

అసలేం జరిగిందంటే?
ఆ రెడ్డిట్ యూజర్ పోస్ట్ ప్రకారం, అతను వైట్‌ఫీల్డ్‌లో ఒక లగ్జరీ 2 BHK అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. అంత భారీ అద్దె చెల్లిస్తున్నప్పటికీ ఆ సొసైటీలో రోజుకో సమస్య వస్తోందట.
- భద్రతా లోపాలు:సెక్యూరిటీ చెకింగ్స్ సరిగా లేకపోవడం వల్ల ఎవరైనా ఈజీగా లోపలికి వచ్చేస్తున్నారు.
- వీధి కుక్కల హల్‌చల్: అపార్ట్‌మెంట్ లోపల విపరీతంగా వీధి కుక్కలు తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయి.
- కరెంట్ కోతలు & వోల్టేజ్ సమస్యలు: తరచూ పవర్ ఫ్లక్చుయేషన్స్ (వోల్టేజ్ హెచ్చుతగ్గులు) రావడం వల్ల రీసెంట్‌గా అతని ఇంట్లోని ఫ్రిజ్ కూడా పాడైపోయిందట!
ఒక్క వాటర్ సప్లై తప్ప, మిగతా ఏ విషయంలోనూ లగ్జరీ ఫీల్ లేదని, "ఇంత ప్రీమియం అమౌంట్ దేనికోసం కడుతున్నాం?" అని అతను ప్రశ్నించాడు.
'సిటీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడమే కారణం!'
ఈ పోస్ట్‌పై స్పందించిన మిగతా నెటిజన్లు బెంగళూరు సిటీలోని మౌలిక సదుపాయాల లోపాన్ని ఎత్తిచూపారు. బెంగళూరులో ఏ బిల్డర్ కట్టిన ప్రాపర్టీ కూడా అంత రేటుకు 'వర్త్' (న్యాయం) కాదని కొందరు కామెంట్ చేశారు. కానీ, బయట రోడ్లు, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా ఉండటం వల్లే, ప్రజలు వేరే దారి లేక ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలను ఆశ్రయిస్తున్నారని విశ్లేషించారు. ఇదే రేట్లకు విదేశాల్లో అయితే అత్యంత అద్భుతమైన లగ్జరీ ప్రాపర్టీస్ వస్తాయని గుర్తుచేశారు.
మరో నెటిజన్ అభిప్రాయం ఎంటంటే.. "ఈ సమస్యలన్నీ అన్ని సొసైటీల్లో ఉండవు. నేను హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ దగ్గర ఉంటున్నాను, అక్కడ వీధి కుక్కల సమస్య అస్సలు లేదు. పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి బెలికామ్ (BESCOM) వల్ల వస్తాయి, దానికి సొసైటీని బ్లేమ్ చేయలేం" అని మరొకరు బిల్డర్లకు మద్దతుగా నిలిచారు.
లగ్జరీ సొసైటీలకు మద్దతుగా కొందరు..
ఈ చర్చలో లగ్జరీ అపార్ట్‌మెంట్లను సమర్థించే వారు కూడా గట్టిగానే వినిపించారు. ఏ గ్రేడ్ (Grade A) బిల్డర్ల దగ్గర ఇలాంటి సమస్యలు రావని ఒక యూజర్ స్పష్టం చేశాడు. తాను నెలకు రూ. 77,000 రెంట్ కడుతున్నానని, అది తన లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పాడు.
సిటీ మొత్తం పవర్ కట్ అయినా, తమ సొసైటీకి డెడికేటెడ్ సబ్‌స్టేషన్ ఉండటం వల్ల తమకు కరెంట్ పోయిన విషయమే తెలియదని, పైగా 100 కంటే ఎక్కువ ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్లు, 20 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారని అతను వివరించాడు. మొత్తానికి, బెంగళూరులో లగ్జరీ ఇళ్ల రేట్లు , క్వాలిటీ ఆఫ్ లైఫ్‌పై జరుగుతున్న ఈ డిబేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications